Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం: చంద్రబాబు

విజయవాడ: ఆకివీడు టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల శాతం పెరగడం శుభపరిణామమన్నారు. జగన్‌రెడ్డి అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జగన్‌రెడ్డి పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. ఓటీఎస్ పేరుతో ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు గుంజుతున్నారని మండిపడ్డారు. వైసీపీ బెదిరించినా ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నాయకులు సరిగా పనిచేయని చోట కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామన్నారు. జగన్‌పై ఉన్న ప్రజావ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వంపైనా చూడలేదని చంద్రబాబు తెలిపారు.

Advertisement
Advertisement