గచ్చిబౌలిలో అద్దెలు పెరిగాయ్‌...

ABN , First Publish Date - 2021-05-04T06:30:00+05:30 IST

కరోనా మహమ్మారి ప్రభావంతో దేశంలోనే అత్యంత ఖరీదైన ఢిల్లీలోని ఖాన్‌ మార్కెట్లో తొలి త్రైమాసికంలో వాణిజ్య ప్రాపర్టీల అద్దెలు 8-17 శాతం మధ్యన తగ్గాయి...

గచ్చిబౌలిలో అద్దెలు పెరిగాయ్‌...

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావంతో దేశంలోనే అత్యంత ఖరీదైన ఢిల్లీలోని ఖాన్‌ మార్కెట్లో తొలి త్రైమాసికంలో వాణిజ్య ప్రాపర్టీల అద్దెలు 8-17 శాతం మధ్యన తగ్గాయి. అదే సమయంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, బంజారాహిల్స్‌, జూబ్లీ హిల్స్‌ ప్రాంతాల్లో అద్దెలు 7 నుంచి 15 శాతం పెరిగాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ నివేదిక తెలియచేస్తోంది. కరోనా తొలి దశలో విధించిన జాతీయ స్థాయి లాక్‌డౌన్‌ ప్రభావం వల్ల తీవ్రంగా ప్రభావమైన రంగాల్లో రిటైల్‌ రంగం ఒకటని, చాలా కంపెనీలు భవిష్యత్‌ విస్తరణ ప్రణాళికలు కూడా తగ్గించుకున్నాయని కంపెనీ చీఫ్‌ అపరేటింగ్‌ ఆఫీసర్‌ పంకజ్‌ రెంజన్‌ అన్నారు. అయితే దేశంలో వాణిజ్య ప్రాపర్టీల అద్దెలు పెరిగిన ప్రాంతాలు కూడా ఉన్నాయంటూ అందుకు ఉదాహరణగా హైదరాబాద్‌ను చూపారు. ప్రస్తుతం గచ్చిబౌలి ప్రాంతంలో చదరపు అడుగు విస్తీర్ణానికి నెలవారీ సగటు అద్దె రూ.115-125 మధ్యన ఉన్నట్టు ఆయన చెప్పారు. గత ఏడాది ఇది రూ.100-120 ఉంది. బంజారాహిల్స్‌లో అద్దెలు రూ.120-130 నుంచి రూ.135-140కి పెరిగాయన్నారు.  


Updated Date - 2021-05-04T06:30:00+05:30 IST