Advertisement
Advertisement
Abn logo
Advertisement

60 ఏళ్లకు పైబడిన ప్రవాసుల వర్క్ పర్మిట్ రెన్యువల్ ఫీజు పెంపు!

కువైట్ సిటీ: ఈ ఏడాది ప్రారంభంలో 60 ఏళ్లకు పైబడిన, ఎలాంటి యూనివర్శిటీ డిగ్రీ లేని ప్రవాస కార్మికుల వర్క్ పర్మిట్ ఇకపై రెన్యువల్ చేయబోమని, వారు దేశం విడిచి వెళ్లిపోవాలని కువైట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ విభాగం వారికి వర్క్ పర్మిట్ రెన్యువల్‌కు అనుమతి లేదు. అయితే, తాజాగా ఆ దేశ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. 60 ఏళ్లకు పైబడిన, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసుల వర్క్ పర్మిట్‌ రెన్యువల్ ఫీజును 100 కువైటీ దినార్లకు(సుమారు రూ.24వేలు) పెంచాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే ఈ విభాగం ప్రవాసులు వారి వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేసుకునే వీలు ఏర్పడుతుంది. కాగా, ప్రతియేటా ఈ రుసుమును రెట్టింపు చేసుకుంటూ వెళ్లనుంది కువైట్. ఇదిలాఉంటే.. జనవరిలో 60 ఏళ్లకు పైబడిన ప్రవాస కార్మికులకు తాజా రూల్ ప్రకారం వర్క్ పర్మిట్లు రెన్యువల్ చేయడం నిలిపివేయడంతో వారు తమ రెసిడెన్సీని ఆర్టికల్ 22 నుంచి ఆర్టికల్ 24కు మార్చుకోవడం జరిగింది.     

Advertisement
Advertisement