ప్రవాసుల కార్ల సంఖ్యపై Kuwaitలో కీలక ప్రతిపాదన.. అమల్లోకి వస్తే అంతే సంగతులు..!

ABN , First Publish Date - 2021-12-15T15:39:51+05:30 IST

దేశంలో రోజురోజుకు భారీగా పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కువైత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా తాజాగా మరో సంచలన ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. వలసదారుల పేరు మీద ఉండే కార్ల సంఖ్యను పరిమితం చేయాలనేదే ఈ కొత్త ప్రతిపాదన. ఈ మేరకు ఆ దేశ ఎంపీ డా. అబ్దుల్లా అల్ తారిజీ తాజాగా...

ప్రవాసుల కార్ల సంఖ్యపై Kuwaitలో కీలక ప్రతిపాదన.. అమల్లోకి వస్తే అంతే సంగతులు..!

కువైత్ సిటీ: దేశంలో రోజురోజుకు భారీగా పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కువైత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా తాజాగా మరో సంచలన ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. వలసదారుల పేరు మీద ఉండే కార్ల సంఖ్యను పరిమితం చేయాలనేదే ఈ కొత్త ప్రతిపాదన. ఈ మేరకు ఆ దేశ ఎంపీ డా. అబ్దుల్లా అల్ తారిజీ తాజాగా పార్లమెంట్‌లో కీలక ప్రతిపాదన చేశారు. వలసదారులు తమ వినియోగానికి వారి పేర్లపై కేవలం రెండు కార్లను మాత్రమే కలిగి ఉండాలని పార్లమెంట్‌లో ఆయన తాజాగా సమర్పించిన తన ప్రతిపాదనలో పేర్కొన్నారు. ప్రవాసులకు ఇలా రెండు కార్లను మాత్రమే తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఎంపీ కోరారు. పరిమితికి మించి వాహనాలు ఉంటే అదనపు రుసుము వసూలు చేయాలని సూచించారు. 


దేశంలో భారీ సంఖ్యలో ఉన్న ప్రవాసులు పెద్ద ఎత్తున పాత వాహనాలు కొనుగోలు చేసి తిరుగుతుండడంతో ట్రాఫిక్ రద్దీ భారీగా పెరుగుతుందన్నారు. అలాగే ప్రమాదాలకు కూడా కారణమవుతున్నారని ఆయన తెలియజేశారు. అంతేగాక పబ్లిక్ గ్రౌండ్స్, స్కూల్స్ పార్కింగ్ స్థలాలు, మసీదులు, షాపింగ్ మాల్స్‌లో పార్కింగ్ కోసం కష్టాపడాల్సి వస్తుందని ఎంపీ పేర్కొన్నారు. కొంతమంది వలసదారులు తమ పేరుపై ఏకంగా 50 వరకు వాహనాలు కలిగి ఉన్నట్లు వచ్చిన వార్తలను ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు. ఒకవేళ ఈ ప్రతిపాదన కనుక ఆమోదం పొందితే ప్రవాసులకు కొంతమేర అవస్థలు ఏర్పడుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ విషయంలో పలు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది కువైత్ సర్కార్. ఇప్పుడు ఈ కొత్త ప్రతిపాదనతో మరింత కఠినంగా వ్యవహారించనుంది.  

Updated Date - 2021-12-15T15:39:51+05:30 IST