పుట్ట మధు అజ్ఞాతంపై భార్య స్పందన ఇదీ....
ABN , First Publish Date - 2021-05-08T01:31:02+05:30 IST
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అజ్ఞాతంపై ఆయన భార్య, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ వివరణ ఇచ్చారు
కరీంనగర్ : పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అజ్ఞాతంపై ఆయన భార్య, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ వివరణ ఇచ్చారు. పుట్ట మధు ఎక్కడికీ వెళ్లలేదని స్పష్టం చేశారు. తన భర్తకు స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, అందుకే ఫోన్ స్విచ్చాఫ్ చేశారని వివరించారు. తన భర్తపై బయట జరుగుతున్న ప్రచారం చాలా తప్పని, ప్రజా ప్రతినిధులకు పర్సనల్ లైఫ్ కూడా ఉంటుందని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ పార్టీలో ఉండేవారు కాబట్టి, ఆయన్ను అప్పట్లో కలిశామని పేర్కొన్నారు. తాము టీఆర్‌ఎస్‌తోనే ఉంటామని, తమను ఈ స్థాయికి తీసుకొచ్చింది సీఎం కేసీఆరేనని ఆమె స్పష్టం చేశారు. పుట్ట మధుపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని శైలజ మండిపడ్డారు.
అజ్ఞాతంలో పుట్టమధు
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అజ్ఞాతంలో ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్నాడని పుట్ట మధు సన్నిహితులు చెబుతున్నారు. పుట్ట మధు పోలీసుల అదుపులో ఉన్నాడని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పుట్ట మధు వ్యవహారం ప్రగతి భవన్ వర్గాలకు తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు. పుట్ట మధు ఆచూకీ దొరక్క కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పుట్ట మధు భార్య శైలజ భేటీ అయ్యారు. ఈటలకు పార్టీ పరంగానే సన్నిహితుడని మధు అనుచరులు చెబుతున్నారు.