హైదరాబాద్‌లో పీడబ్ల్యూసీ యాక్సిలరేషన్ సెంటర్
ABN , First Publish Date - 2021-04-14T06:24:15+05:30 IST
ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ సంస్థ తమ యాక్సిలరేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. పీడబ్ల్యూసీ కోల్కతా, బెంగళూరు సర్వీస్ డెలివరీ సెంటర్లు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి
హైదరాబాద్: ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ సంస్థ తమ యాక్సిలరేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. పీడబ్ల్యూసీ కోల్కతా, బెంగళూరు సర్వీస్ డెలివరీ సెంటర్లు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. తమ సంస్థకు అవసరమైన ప్రతిభ, నైపుణ్యాలు గల మానవ వనరులతో హైదరాబాద్ వ్యూహాత్మక కేంద్రంగా నిలిచిందని, తెలంగాణలో నాణ్యతతో కూడిన ప్రతిభకు ఇది దర్పణమని యాక్సిలరేషన్ సెంటర్ మేనేజింగ్ పార్టరన్ హరికుమార్ ఈ సందర్భంగా అన్నారు.