'క్వాంటాస్' 7 అవర్ స్పెషల్ ఫ్లైట్.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

ABN , First Publish Date - 2020-09-20T00:58:27+05:30 IST

ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది.

'క్వాంటాస్' 7 అవర్ స్పెషల్ ఫ్లైట్.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

సీడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. విమాన ప్రయాణం చేయాలనే సరదా ఉన్నవారికి కోసమే ఈ ప్రత్యేక విమానాన్ని నడుపుతున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం పేర్కొంది. '7 అవర్ సీనిక్ ఫ్లైట్ టు నోవెర్' పేరిట ఈ స్పెషల్ విమాన జర్నీని క్వాంటాస్ ప్లాన్ చేసింది. ఈ విమానం ప్రత్యేకంగా ఏ గమ్యస్థానికంటూ వెళ్లదు. కేవలం ఆస్ట్రేలియాలోని ప్రధాన సందర్శన ప్రాంతాలైన ఉలూరు, కటా ట్జుటా, విట్సుండేస్, గోల్డ్ కోస్ట్, బైరాన్ బే, సిడ్నీ హార్బర్ మీదుగా ప్రయాణించి 7 గంటల తర్వాత ఎక్కడి నుంచి అయితే బయల్దేరిందో తిరిగి అక్కడే ల్యాండ్ అవుతుంది. అక్టోబర్ 10న ఈ విమానం సీడ్నీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి... 7 గంటల తర్వాత తిరిగి ఇదే విమానాశ్రయానికి చేరుకుంటుంది. 


ఈ స్పెషల్ ఫ్లైట్‌కు సంబంధించిన 134 టికెట్లను ఎయిర్‌లైన్స్ శనివారం అమ్మకానికి పెట్టగా హాట్ కెకుల్లా అమ్ముడుపోయినట్లు నిర్వహకులు పేర్కొన్నారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయట. బిజినెస్ క్లాస్, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ అని మూడు క్లాసులుగా ఈ టికెట్లను విక్రయించారు. కాగా, ఈ విమాన టికెట్ ధరలను 787 ఆస్ట్రేలియన్ డాలర్లు(రూ.42,244) నుంచి 3,787 ఆస్ట్రేలియన్ డాలర్లు(రూ.2,03,280)గా నిర్ణయించింది క్వాంటాస్ ఎయిర్‌లైన్స్. ఇక ఇంతకుముందు తైవాన్ సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా 'ఫాంటసీ ఫ్లైట్ టు నోవెర్' పేరిట ఇదే తరహాలో ఒక విమాన సర్వీస్ నడిపిన సంగతి తెలిసిందే.   

Updated Date - 2020-09-20T00:58:27+05:30 IST