Abn logo
Oct 27 2021 @ 20:22PM

‘యాదాద్రి’ విరాళాల సేకరణకు క్యూఆర్‌ కోడ్‌

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పునర్నిర్మాణంలో భాగంగా విమాన గోపుర బంగారు తాపడం నిర్వహణకు భక్తులను భాగస్వామ్యం చేస్తున్నారు. భక్తుల నుంచి విరాళాలు సేకరించేందుకు క్విక్‌ రెస్పాన్స్‌ (క్యూఆర్‌) కోడ్‌ను దేవస్థాన ఈవో గీతారెడ్డి బుధవారం విడుదల చేశారు. దీంతో ఆన్‌లైన్‌ ద్వారా భక్తులు అందజేసే విరాళాలు నేరుగా దేవస్థాన బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని ఈవో తెలిపారు. విమాన గోపురానికి బంగారు తాపడం కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే భక్తులు ఈ క్యూఆర్‌ కోడ్‌ను సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఈవో కోరారు. మొబైల్‌ ఫోన్ల ద్వారా దీన్ని విస్తృత ప్రచారం చేస్తామన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption