క్వాలెంటైన్...

ABN , First Publish Date - 2020-03-28T09:17:39+05:30 IST

ఎన్ని మరచిపోని అనుభూతులను పంచుతోంది..ఈ క్వాలెంటైన్..

క్వాలెంటైన్...

ఎన్ని మరచిపోని

అనుభూతులను

పంచుతోంది..ఈ క్వాలెంటైన్..

యంత్రంలా మారిన

మనుషులకు 

నిజమైన అనురాగం రుచిచూపుతోంది..

ఇల్లాలి అనురాగాన్ని

తనివితీరేలా పొందే భాగ్యం ఓ వరమే కదూ...

నువ్వు 

జాగ్రత్తగా ఉన్నట్లయితే..

ఆమె ప్రతి కదలిక

నీకు గిలిగింతలు పెట్టేస్తూ....

ఇల్లంటే ఎంత స్వర్గమో..

అర్ధమౌతోంది కదూ...

నీ పని ఒత్తిడి నుండి

నిన్ను నువ్వు

తేలిక పడేందుకు..

నిత్యం నీ సహచరి

స్పర్శ ఎంత ఆహ్లాదమో..

ఆమె నవ్వులు

క్రీగంటి చూపులు

నీకు మతిపోగొట్టేసి

నిన్ను నువ్వు దాసోహం

అనుకోవూ ...

నీ ఉనికికి ఆమె ఎంత

పరవశిస్తుందో కదూ...

ఇంకేం..ఈ ఇరవై

రోజులు...నీకు

అన్నీ అందివచ్చిన

ఏకాంతాలే...అలసిన

దేహాలను సేద తీర్చే

ఆనంద క్షణాలే.. 

అపురూపంగా 

ఆస్వాదించగలిగితే....

– అవధానం అమృతవల్లి

Updated Date - 2020-03-28T09:17:39+05:30 IST