‘నిబంధనలు నచ్చకపోతే రాకండి’
ABN , First Publish Date - 2021-01-03T23:15:59+05:30 IST
టీమిండియాకు క్వీన్స్‌ట్యాండ్ ఆరోగ్య మంత్రి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ‘నచ్చకపోతే ఇక్కడకు వచ్చి ఆడకండి. అంతేకానీ కరోనా నిబంధనలను మాత్రం సులభం చేసేది లేదు’ అని ఆమె తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతున్న ఓ వీడియోను స్వయంగా..
కాన్‌బెర్రా: టీమిండియాకు క్వీన్స్‌ట్యాండ్ షాడో హెల్త్ మినిస్టర్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ‘నచ్చకపోతే ఇక్కడకు వచ్చి ఆడకండి. అంతేకానీ కరోనా నిబంధనలను మాత్రం సులభం చేసేది లేదు’ అని ఆమె తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతున్న ఓ వీడియోను స్వయంగా ట్విటర్‌లో షేర్ చేశారు. ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ సిడ్నీలో జనవరి 7వ తేదీ నుంచి జరుగుతుంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ క్వీన్స్‌ల్యాండ్ రాజధాని బ్రిస్బేన్‌లో జరగాల్సి ఉంది. అయితే ఉన్నట్లుండి సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం న్యూ సౌత్ వేల్స్‌తో సరిహద్దులను మూసివేసింది.
ఈ నేపథ్యంలో టీమిండియా-ఆసీస్ మధ్య జరిగే నాలుగో మ్యాచ్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే ఆటగాళ్లను మాత్రం అనుమతిస్తామని అక్కడి ప్రభుత్వం చెప్పింది. దీంతో ఊపిరి పీల్చుకున్న టీమిండియా.. క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వాన్ని మరో రిక్వెస్ట్ చేసింది. కరోనా క్వారంటైన్ నిబంధనలను కొంత సడలించాలని కోరింది. అయితే దీనిపై క్వీన్స్‌ల్యాండ్ షాడో హెల్త్ మినిస్టర్ రాస్ బేట్స్ తీవ్రంగా స్పందించారు.
ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ‘మీరు నిబంధనలను పాటిచకపోతే ఇక్కడకు రాకండి. నిబంధనలకు అనుగుణంగా ఆడేందుకు ఇష్టపడితేనే ఇక్కడకు రండి. లేకుంటే అవసరం లేదు’ అంటూ ఆ వీడియోలో ఘాటుగా స్పందించారు. మరి దీనిపై టీమిండియా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.