Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెక్‌పోస్టును తనిఖీ చేసిన రాచకొండ సీపీ

నారపల్లిలోని చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీని పరిశీలిస్తున్న రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌

ఘట్‌కేసర్‌: పోచారం మున్సిపాలిటీలోని నారపల్లి వద్ద లాక్‌డౌన్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును గురువారం రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నారపల్లిలోని హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టును తనిఖీ చేయడంతో పాటు అక్కడున్న మేడిపల్లి పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా లాక్‌డౌన్‌ అమలుపై అపమ్రత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి సీఐ అంజిరెడ్డి, ఎస్‌ఐ రవికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement