Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్ కంపెనీపై ఏపీ హైకోర్టులో రఘురామ పిటిషన్

అమరావతి: సీఎం జగన్ కంపెనీపై ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్‌ లీజు పొడిగింపుని సవాల్‌ చేస్తూ ఏపీ హైకోర్టులో రఘురామ పిటిషన్‌ వేశారు. మైనింగ్ లీజ్‌లో అక్రమాలు జరిగాయని సీబీఐ నిర్ధారించిందన్నారు. సీబీఐ కేసును ప్రస్తావించకుండా హైకోర్టులో లీజ్ పొడిగింపునకు అనుమతి పొందడాన్ని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. 

సీబీఐ కేసు దాఖలు చేసిన కంపెనీకి లీజు ఎలా పొడిగిస్తారని రఘురామ ఆ పిటీషన్‌లో ప్రశ్నించారు. జగన్ సొంత కంపెనీ కావటంతో అధికారులు నిబంధనలు ఉల్లఘించి అనుమతులు ఇచ్చారని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు.  సరస్వతి కంపెనీ, పరిశ్రమలశాఖ, మైనింగ్ శాఖ, ఏపీ పొల్యూషన్ బోర్డులను ప్రతివాదులుగా రఘురామ కృష్ణరాజు చేర్చారు.  

Advertisement
Advertisement