Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 19 2021 @ 17:46PM

సెప్టెంబర్ 17న తెలంగాణకు రాహుల్‌గాంధీ

హైదరాబాద్‌: ఏఐసీసీ నాయకుడు రాహుల్‌గాంధీ సెప్టెంబర్ 17న తెలంగాణలో పర్యటించనున్నారు. దళిత గిరిజన ముగింపు సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. సెప్టెంబర్ 17న వరంగల్‌లో దళిత గిరిజన ముగింపు సభ జరుగునుంది. వరంగల్‌లో 5లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంను బీజేపీ నిర్వహించే రోజే, దళిత గిరిజన ముగింపు సభను నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీకి సభతో కౌంటర్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వరంగల్ సెంటిమెంట్‌ను కాంగ్రెస్ నమ్ముతోంది. 2004 ఎన్నికల ముందు బీసీ గర్జన సభను వరంగల్ నగరంలో నిర్వహించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 


Advertisement
Advertisement