ఏపీకి 2,125 టన్నుల ఆక్సిజన్‌: రైల్వేశాఖ

ABN , First Publish Date - 2021-06-02T09:04:55+05:30 IST

కరోనా బాధితుల ప్రాణాలు నిలబెట్టే లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ (ఎల్‌ఎంవో) సరఫరాలో రైల్వే మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషిస్తోంది

ఏపీకి 2,125 టన్నుల ఆక్సిజన్‌: రైల్వేశాఖ

న్యూఢిల్లీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): కరోనా బాధితుల ప్రాణాలు నిలబెట్టే లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ (ఎల్‌ఎంవో) సరఫరాలో రైల్వే మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 334 రైల్వే ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రె్‌సల్లో 1,357 ట్యాంకర్ల ద్వారా 15 రాష్ర్టాలకు 22,916 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశామని, వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు 2,125 టన్నులు అందించామని రైల్వేశాఖ మంగళవారం వెల్లడించింది. ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు మొత్తం 9,197 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేసినట్టు పేర్కొంది. తెలంగాణకు 2,062, కర్ణాటకకు 2,440, తమిళనాడుకు 2,190, కేరళకు 380 టన్నుల చొప్పున సరఫరా చేసినట్టు ప్రకటించింది. మహారాష్ట్రకు 614, ఉత్తరప్రదేశ్‌కు 3,797, మధ్యప్రదేశ్‌కు 656, ఢిల్లీకి 5,557, హరియాణాకు 2,089 టన్నుల చొప్పున సరఫరా చేసినట్లు రైల్వేశాఖ వివరించింది.

Updated Date - 2021-06-02T09:04:55+05:30 IST