ఏపీలో శనివారం ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు

ABN , First Publish Date - 2020-08-15T01:18:38+05:30 IST

అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం రెండు రోజుల్లో మరింతగా బలపడనుందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది.

ఏపీలో శనివారం ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు

అమరావతి: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం రెండు రోజుల్లో మరింతగా బలపడనుందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఏపీలో శనివారం ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.


మరోవైపు  గోదావరి ఉరకలు పరుగులు పెడుతుంది. గడచిన మూడు రోజులుగా వరద నీరు క్రమేపీ పెరుగుతుంది. ఒక వైపు మారిన వాతావరణం, వరుసగా అల్పపీడన ద్రోణులు, వాయుగుండం కూడా జతకలియడంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉండడంతో గోదావరిలో వరద ఒక్కసారిగా ముంచు కొచ్చింది. వరద తీవ్రతను అంచనా వేయడంతో పాటు గోదావరిలో వరదను సీడబ్ల్యూసీ ఎప్పటి కప్పుడు అంచనా కడుతుంది.

Updated Date - 2020-08-15T01:18:38+05:30 IST