అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. 10 మంది మృతి

ABN , First Publish Date - 2021-08-23T05:19:29+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. వరదల్లో చిక్కుకుని దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల ధాటికి వందలాది ఇళ్లు

అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. 10 మంది మృతి

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. వరదల్లో చిక్కుకుని దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల ధాటికి వందలాది ఇళ్లు నీట మునిగాయి. 30 మందికిపైగా వరదల్లో గల్లంతయ్యారు. వరదల కారణంగా వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రోజు 34.5 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. 1982 నుంచి ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారన్నారు. అటు న్యూజెర్సీలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. వరద ఉధృతి కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టెన్నెస్సీ గవర్నర్ ట్విట్టర్ ద్వారా రాష్ట్ర ప్రజలకు సూచించారు. 


Updated Date - 2021-08-23T05:19:29+05:30 IST