Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 18 2021 @ 15:23PM

కేసీఆర్‌కు రాజాసింగ్ కౌంటర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటరిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సినిమా ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. ప్రజలను వంచించటంలో కేసీఆర్‌ను మించిన వాళ్లు లేరని విమర్శించారు. దర్నా చౌక్ వద్దని కేసీఆర్ యూటర్న్ తీసుకున్నాడని దుయ్యబట్టారు. హుజురాబాద్ ఓటమితో గ్రాఫ్ పడిపోవటంతో కేసీఆర్ కవర్ చేసుకునే పనిలో ఉన్నాడని ఎద్దేవాచేశారు. రైతు చట్టాలు బాగున్నాయని గతంలో కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసినందుకే కేసీఆర్ జిమిక్కులు చేస్తున్నారని రాజాసింగ్ చెప్పారు.

Advertisement
Advertisement