Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 29 2021 @ 05:55AM

వేములవాడ రాజన్న క్షేత్రంలో కార్తీక సందడి

రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. కార్తీక మాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తలనీలాలు సమర్పించడంతోపాటు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, కుంకుమపూజ వంటి ఆర్జిత సేవల్లో  పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గండాదీపంలో నూనెపోయడంతోపాటు ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో అధికారులు  ఏర్పాట్లు చేశారు. 

Advertisement
Advertisement