రాజాసింగ్ జిమ్‌లో కండలు ఎందుకు కరిగిస్తున్నట్లు?

ABN , First Publish Date - 2021-02-28T03:47:41+05:30 IST

రాజాసింగ్ జిమ్‌లో కండలు ఎందుకు కరిగిస్తున్నట్లు?

రాజాసింగ్ జిమ్‌లో కండలు ఎందుకు కరిగిస్తున్నట్లు?

రాజాసింగ్ జిమ్‌లో కండలు ఎందుకు కరిగిస్తున్నట్లు?, రాజాసింగ్ జిమ్‌లో కండలు ఎందుకు కరిగిస్తున్నట్లు?.  రాజాసింగ్ ఏ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు..?,  బీజేపీలో రాజాసింగ్ దుష్మన్లు ఎవరు?, జగన్‌పై పహిల్వాన్ సంధించిన అస్త్రమేంటి.?,  జనాన్ని రెచ్చగొట్టడం వెనుక రాజాసింగ్ వ్యూహమేంటో..? గో సంరక్షణ వెనుక అసలు మేటరేంటి..? అనే విషయాలు రాజాసింగ్ మాటల్లో చూద్దాం..


ప్రశ్న: రాజాసింగ్ గారు ఏంటి మీరు ఇక్కడ, ఈ సీరియస్ వర్కౌట్స్ ఎందుకు.. 


జవాబు: ప్రస్తుతం యువకులు రాత్రిపూట అక్కడ ఇక్కడ చౌరస్తాల్లో  కూర్చుంటున్నారు. హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు. వాళ్లందరికీ మంచి సందేశం ఇవ్వాలనుకున్నా. మోడీ గారు ఎప్పుడూ చెప్తుంటారు...అందరూ ఆరోగ్యంగా ఉండే ఇంకా ఎక్కువ దేశ సేవ సమాజ సేవ చేయొచ్చని. అదే కాన్సెప్ట్ తో జిమ్ చేయడం స్టార్ట్ చేశా. నేను ఫిట్ గా తయారైతే...యువకులు నన్ను ఫాలో అవుతూ జిమ్ మొదలుపెడతారని ఉద్దేశం తో వర్కౌట్స్ మొదలు 

పెట్టాను.


ప్రశ్న:  ఐదు నెలలకు ముందు రాజాసింగ్ కు ఇప్పటి రాజాసింగ్‌కు చాలా తేడా కనిపిస్తోంది. వెయిట్ లాస్ కోసమేనా ఈ జిమ్ వర్కౌట్స్ లేదంటే ఇంకా ఏమైనా ఉందా? 

జవాబు: ఛత్రపతి శివాజీ మహారాజ్  కొడుకు సంభాజీ మహరాజ్‌పై ఒక సినిమా తియ్యాలనే కల ఉంది. 


ప్రశ్న:  మీరే తీద్దామనుకుంటున్నారా? 

జవాబు : నేనే తీద్దామని..ఆ రోల్ నేనే పోషిద్దామనుకుంటున్నా. ఆయనది మంచి ఫిజిక్ . దేశం కోసం ధర్మం గురించి పోరాడాడు. ఛత్రపతి శివాజీ గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన కొడుకు సంభాజీ మహారాజ్ గురించి ఎవ్వరికీ తెలియదు. అందుకే మూవీ తియ్యాలనుకుంటున్నా. ఆపాత్రను నేనే పోషించాలనుకుంటున్నా దానికోసమే ఆయనలా ఒక మంచి ఫిజిక్ కోసం కష్టపడుతున్నా.


ప్రశ్న:  వెయిట్ ఏమైనా తగ్గారా? మీరన్నారు కదా అంతకముందు 110 కిలోల పైనే బరువు ఉండేవాడినని..

జవాబు : నేను దాదాపు 117 కిలలో వెయిట్ ఉండే. ఇప్పుడు 90 కేజీలకు వచ్చాను. 


ప్రశ్న:  27 కేజీలు తగ్గారా..ఎట్లా తగ్గారు..ఎలాంటి వర్కౌట్స్ చేస్తున్నారు?

జవాబు : లాక్ డౌన్ లో చాలా మంది వెయిట్ పెరిగింది. కానీ నా వెయిట్ తగ్గింది. ప్రాపర్ డైట్ తీసుకున్నా. జిమ్ స్టార్ట్ చేశాను. ఆరె నెలల్లోనే ఆరు కేజీలు తగ్గాను. డెయిలీ మూడు సార్లు వర్కౌట్స్ చేశాను. ఎలాంటి సప్లిమెంట్ తీసుకోలేదు.  ఎక్కువ కాలరీలు బర్న్ చేయడం..తక్కువ కాలరీలు ఉన్న డైట్ తీసుకోవడంతో చాలా స్పీడ్‌గా తగ్గాను. 


ప్రశ్న:  చాలా మంది వెయిట్ తగ్గాలనుకుంటున్నారు. మీ సీక్రెట్ చెప్పండి. ఎలాంటి డైట్ ఫాలో అయ్యారు?ఎటువంటి వర్కౌట్స్ చేశారు?

జవాబు :చాలామంది యూట్యూబ్‌లో చూస్తున్నారు. కొందరు వేరే వేరే ప్రాడక్ట్స్ కోసం వెతుకుతున్నారు. ఇది తాగితే వెయిట్ తగ్గుతాం..ఈ కూల్ డ్రింక్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాం అనుకుంటున్నారు. అది చాలా తప్పు. రిస్క్ తీసుకుంటున్నాం. హెల్త్‌ను డేంజర్‌లో పడేస్తున్నాం. నిజంగా మంచి ఫిజిక్ కావాలి..వెయిట్ తగ్గాలి అంటే తినే ఆహారాన్ని కంట్రోల్ చెయ్యాలి. ప్రాపర్ట్ డైట్ తీసుకుని..సరైన వర్కౌట్స్ చేస్తే కచ్చితంగా తగ్గుతాం. చాలా మంది ఏజ్ పర్సన్స్ కు కానీ మహిళలకు కానీ యువకులకు కానీ జిమ్ ఎట్లా చెయ్యాలనే ప్రశ్న తలెత్తుతోంది. అలాంటి వాళ్లు జిమ్ చేసే అవసరం లేదు. ప్రాపర్ డైట్ తీసుకుని ఉదయం ఒక అరగంట..సాయంత్రం ఒక అరగంట వాకింగ్ చేసినా వెయిట్ తగ్గుతుంది. 


ప్రశ్న:  అయితే వాకింగ్‌తో కూడా వెయిట్ లాస్ అవుతారంటారు? 

జవాబు : ఫస్ట్ అసలు మనం ఏం తింటున్నాం?  తినే ఆహారంలో ఎన్ని కాలరీలు ఉన్నాయో తెలియాలి. ఎక్కువ కాలరీలు ఉన్న ఆహారం తీసుకుని..తక్కువ కాలరీలు బర్న్ చేస్తే అసలు వెయిట్ తగ్గము. తక్కువ కాలరీ ఫుడ్ తిని..ఎక్కువ కాలరీలు బర్న్ చేస్తే సులభంగా వెయిట్ తగ్గుతాం. ఎలాంటి ప్రాడక్ట్స్ అవసరమే లేదు. 


ప్రశ్న:  మీ రెగ్యులర్ డైట్ ఎట్లా ఉంటోంది? 

జవాబు : రోజూ పొద్దునే వితవుట్ షుగర్ ఓ కాఫీ తాగుతా. తర్వాత వేడి నీళ్లతో మసాలా లేని 200 గ్రాముల ఓట్స్ తింటాను. మూడు గంటలు జిమ్ చేస్తా. లంచ్ లో రెండు రోటీలు..లైట్ గా బ్రౌన్ రైస్ ..సలాడ్ ..200 గ్రాముల పనీర్ తీసుకుంటా. డిన్నర్ లో ఒక రోటీ..సలాడ్ ఎక్కువ తీసుకుంటా. ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తింటాను. తక్కువ కాలరీ...ఎక్కువ ప్రొటీన్ ఉండే ఫుడ్ తీసుకుంటా. దీంతో మంచి ఫిజిక్ వస్తది. బాడీలో ఉన్న బ్యాట్ ఫ్యాట్ పోతోంది. 


ప్రశ్న:  డెయిలీ ఎన్ని క్యాలరీలు బర్న్ చేస్తుంటారు?


జవాబు : దాదాపు 1500 క్యాలరీలు బర్న్ చేస్తా. నేను తీసుకునే ఆహారంలో 800 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. సో ..ఫిజిక్ మంచిగా మారింది. వెయిట్ కూడా తగ్గాను .


ప్రశ్న:  ఎప్పుడూ ఖద్దర్ డ్రెస్ లో కాషాయం దుస్తుల్లో కనపడే రాజాసింగ్..ఇప్పుడు ఇలా జిమ్ డ్రెస్‌లో వర్కౌట్స్ చేస్తూ ఉండడం..ఎలా ఉందసలు? ఎట్లా అనిపిస్తుంది?

జవాబు :  చాలా హ్యాపీగా ఫీలవుతున్నా.  వెయిట్ ఎక్కువున్నప్పుడు నడవడానికి కానీ.. రాజాసింగ్ ఏంది ఇంత లావుగా ఉన్నాడు. మొహం కూడా డేంజర్ గా కనిపిస్తోంది అని చాలా మంది ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేస్తుండే వారు. తెలంగాణలో కానీ ..యావత్ భారతదేశంలో కానీ మీకు మంచి గుర్తింపు ఉంది సార్ ..నాకు కొంచెం టైమ్ ఇస్తే మీ ఫిజిక్ మొత్తం చేంజ్ చేస్తా అని నా ట్రైనర్ విక్రం సింగ్ అన్నాడు. ఆయన గైడెన్స్ ప్రకారం నడుచుకుంటున్నా. 


ప్రశ్న: మొత్తం మీద వెయిట్ లాస్ ప్లస్ శివాజీ మహారాజ్ కొడుకు మీద తీసే సినిమాలో హీరో పాత్ర కోసం వర్కౌట్స్ చేస్తున్నారు. అంతేనా? 


జవాబు : అంతే. ఆ సినిమా తియ్యడం నా లక్ష్యం. ఆయన దేశం కోసం...ధర్మం కోసం ప్రాణాలర్పించాడు. అలాంటి వ్యక్తి గురించి ప్రతి ఒక్క దేశ భక్తుడు..యువకులు తెలుసుకోవాలనేది నా ఉద్దేశం.


ప్రశ్న:  రాజకీయాల్లో ముఖ్యంగా కండ బలంతో పాటుగా బుద్ది బలం కూడా కావాలని అంటారు. కానీ ఎందుకో దాన్ని మీరు కొంచెం మిస్పవుతున్నట్టు అనిపించట్లేదా మీకు ? 

జవాబు : నాకైతే అలా ఏం అనిపించట్లేదు. నేను అన్ని విధాలుగా పర్ ఫెక్ట్ గా ఉన్నాను. ఏం చేసినా ఆలోచించే చేస్తా. 


ప్రశ్న:  వర్కౌట్స్ చేస్తూ..సీరియస్ కామెంట్లు చేస్తూ..వార్నింగ్‌లు  ఇవ్వడం  ఎందుకు జిమ్ వేదికగానే ఇవన్నీ చేస్తుంటే ఎలా అనిపిస్తోంది? 

జవాబు : నా వల్ల యువకులంతా బయటకు రావాలి వాళ్ల జీవితాలను సద్వినియోగం చేసుకోవాలి. సమాజం గురించి దేశం..ధర్మం కోసం ఆలోచించాలి. హిందూ ధర్మానికి చాలా మంది శత్రువులున్నారు. నిత్యం ఏదో ఒక కుట్ర చేస్తున్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లాంటి డేంజరస్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. భారతదేశం పైన హిందువుల పైనా దాడులు చెయ్యాలనే ఆలోచన చేస్తున్నాయి. గతంలో ఢిల్లీలో ఒక ఇంటలిజెన్స్ ఆఫీసర్ ను నరికి చంపారు. కర్నాటక కేరళలో 22 మంది సంఘ్ కార్యకర్తలను చంపేశారు. ఒక సైన్యంలా తయారవుతూ దాడులకు సిద్ధమవుతున్నారు.  అలాంటి సమయంలో  భారతదేశంలో ఉన్న యువకులంతా  దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలనేదే నా లక్ష్యం. 


ప్రశ్న: క్వశ్చన్ : ప్రస్తుతం కోవిడ్ ప్యాండమిక్‌లో ఉన్నాం. చాలా మంది లీడర్లు కూడా కరోనా బారిన పడ్డారు. కానీ రాజాసింగ్ కు మాత్రం కరోనా రాలేదు. ఏంటి సీక్రెట్ ఏంటి?

జవాబు : ఇమ్యునిటీని పెంచుకున్నాను. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు వర్కౌంట్స్ చేశాను. అందరికీ అదే సందేశమిచ్చాను. భయపడుతూ ఇంట్లో కూర్చోకుండా..అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కనీసం ఒక గంట వాకింగ్ చెయ్యమన్నాను. చాలా మంది పాటించారు. లాక్ డౌన్‌లో నా నియోజకవర్గంలో వేల మందికి భోజనం పెట్టాను. ఫుడ్ కోసం ఫోన్ చేసిన ప్రతి ఇంటికి ఆహారం పంపించాను. అలాంటి సమయంలో నా కార్యకర్తలకు కూడా ఎవ్వరికీ కరోనా రాలేదు. ఎందుకంటే అందరూ రోజుకు మూడుసార్లు వర్కౌట్స్ చేస్తుండేవాళ్లు. 


ప్రశ్న:  ఇవి పక్కన పెడితే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజీపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మీరు. కానీ ఎందుకో మీ ప్రాధాన్యత తగ్గినట్టు కనిపిస్తోంది. దుబ్బాక ‌తో పాటు జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కూడా ఎక్కడా కనిపించలేదు? ఎందుకు రాజాసింగ్ సైలెంట్ అయ్యాడు? 


జవాబు :  దుబ్బాకలో ఫస్ల్ ప్రచారానికి వెళ్లింది నేనే. నేను వెళ్లిన తర్వాతనే  చాలా మంది టీఆర్ఎస్ సర్పంచ్‌లు యువకులు బీజేపీ‌లో జాయిన్ అయ్యారు. 


ప్రశ్న:  అంటే యాక్టివ్ పాలిటిక్స్ లో ఎక్కడా కనిపించట్లేరు. కేవలం సంఘ్ పరివార్ కార్యక్రమాలు..గో సంరక్షణకు సంబంధించిన యాక్టివిటీస్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. అంతేగానీ ఏ ఎన్నికల్లోనూ..అంతెందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీ రోల్ ఎక్కువగా లేదు? 


జవాబు : జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో నా సొంత మేనల్లుడు చనిపోయాడు. దాదాపు పది రోజులు బయటకు రాలేని పరిస్థితి. దాని తర్వాత ఐదు రోజుల్లో 50 డివిజన్లలో ప్రచారం చేశాను. ఒక్కరోజే మిగలడంతో నా నియోజకవర్గంలో మాత్రం కేవలం చివరి రోజు బైక్ ర్యాలీలో పాల్గొన్నాను. ఆరు డివిజన్లలో ఐదు మంది బీజేపీ కార్పొరేటర్లు గెలిచారు. పార్టీ ఆదేశానుసారం నడుచుకోవడమే నా పని. 



ప్రశ్న : గెలిచిన ఐదుగురు కార్పొరేటర్లు మీరు సూచించిన అభ్యర్థులు కారు కదా. మీ సొంత నియోజకవర్గంలో మీ అనుచరులకు టిక్కెట్లు ఇప్పించుకోలేని పరిస్థితి ఎందుకొచ్చింది?

జవాబు :  కరెక్టే. పార్టీ ఆదేశించాక ఏం చేయలేం. గత నాలుగేళ్లుగా ప్రతి డివిజన్‌లో కార్యకర్తలు కమిటెడ్‌గా పనిచేస్తున్నారు. నా నియోజకవర్గంలో క్యాండెట్లను సెలక్డ్ చేసుకునే స్వేచ్చ పార్టీ నాకు ఇస్తుంది అనుకున్నాను. గతంలో కిషన్ రెడ్డి సార్ లక్ష్మణ్ సార్  నియోజవర్గాల్లో కానీ ఇంతకముందు ఎమ్మెల్యేలున్న చోట్ల కానీ క్యాండెట్లను డిసైడ్ చేసుకునే పవర్ ఇచ్చినట్లే నాకూ ఇస్తారనుకున్నా. కానీ రెండు డివిజన్లలో అలా జరగలేదు. మిగతా నాలుగు డివిజన్లలో నేను చెప్పిన వారికే టికెటిచ్చారు. 


ప్రశ్న : ఇంకా ఆ అసంతృప్తి అలాగే ఉందా?

జవాబు :  ఇప్పుడేం చెయ్యలేము. వాళ్లు కూడా గెలిచారు. ఇప్పుడు ఎలాంటి  సమస్యా లేదు. 


ప్రశ్న : బీజీపీలో  రాజాసింగ్ ప్రాధాన్యత అంటే ఏం చెప్తారు?

జవాబు :  నేను అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్. మా అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు  ఏ నియోజకవర్డానికి అయినా వెళ్తున్నా. హుజూర్ నగర్‌కు వెళ్లాను. పూర్తి స్వేచ్చ ఇస్తున్నారు. బాగా పని కల్పిస్తున్నారు. 


ప్రశ్న : రాజాసింగ్ .. పార్టీ అధ్యక్షుడెవరైనా వాళ్లతో గొడవపడుతాడని... గొడవలంటే బాగా ఇష్టమనే కంప్లయింట్ ఉంది. దీంతో నాయకులు రాజాసింగ్ ను పట్టించుకోరు..మీరు వాళ్లను పట్టించుకోరు ..ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తోంది?

జవాబు :  అలా ఏం లేదు. మా పార్టీలో ఒక వర్గం ఉంది. వాళ్లకు నాతో ఏం సమస్యో తెలియదు. ఎప్పుడూ నా వెనకాలే పడుతుంటారు. రాజాసింగ్ కు ఎలా డ్యామేజ్ చెయ్యాలని చూస్తుంటారు. రాజాసింగ్ పై ఏదో కామెంట్ చేస్తే..ఆయన రియాక్ట్ అవుతాడు. ఇలాంటి వాళ్లుంటే తెలంగాణలో పనిచెయ్యడం కష్టమని మా అధ్యక్షుడికి చెప్పాను. ప్రతి మంచి పనికి అడ్డు పడుతుంటారు. వీళ్లందరిపై దృష్టి పెట్టాలని కోరాను. బండి సంజయ్ వాళ్లందరికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. రాజాసింగ్ నియోజకవర్గంలో వేలు పెట్టొద్దని చెప్పారు. 


ప్రశ్న : ఆ వర్గం పూర్తిగా దూరమైనట్టేనా. ఇంకా మీ జోలికి వస్తున్నారా?

జవాబు :  కొద్ది కొద్దిగా తగ్గుతున్నారు. త్వరలోనే పూర్తిగా తగ్గుతారనే నమ్మకముంది. 


ప్రశ్న : 2018 ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మీరు. కానీ మిమ్మల్ని ఓడించేందుకు కొందరు ప్రయత్నించారన్నారు. కార్యకర్తలే మిమ్ముల్ని గెలిపించుకున్నారన్నారు. ఇంతకీ ఓడించిడానికి ప్రయత్నించిన వారెవరు?

జవాబు : ఇదే వర్గం. పేర్లు చెప్పను. మా పార్టీ పైనే కామెంట్ చేయలేను. ఇప్పడు పార్టీ బాగా పనిచేస్తోంది. 2018 లో టికెట్ ఇవ్వొద్దని కొందరు పెద్ద మనషులు ఢిల్లీకి వెళ్లారు. వాళ్లకు పార్టీని డెవలప్ చేయడం చేతకాదు. వేరే వాళ్లు పనిచేస్తే..వారిని ఏదో రకంగా డ్యామేజ్ చెయ్యాలని చూస్తుంటారు. అమిత్ షా గారికి పెద్ద పెద్ద అధికారులకు రాజాసింగ్ కు టికెట్ ఇవ్వొద్దని కోరారు. టికెట్ ఇస్తే పనిచెయ్యమని..రాజాసింగ్ ఓడిపోతారని ఛాలెంజ్ చేశారు. అమిత్ షా గారు తెలంగాణలో పర్యటించనప్పుడు బహిరంగ సభల్లో పాల్గొన్పప్పుడు నాకు ప్రజల్లో యువకుల్లో ఉన్న  ఆదరణను స్వయంగా చూశారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వకుండా ఉండలేమని...ఆ వర్గానికి చెప్పి పంపించారు. కేవలం అమిత్ షా వల్లనే నాకు టికెట్ లభించింది. 


ప్రశ్న : రాజాసింగ్‌కు సొంత పార్టీలోనే దుష్మన్‌లు ఎక్కువ అని అంటారు? 

జవాబు :  ఉన్నారు కదా. చాలా మంది దుష్మన్ కు ఉన్నారు. దానికన్నా ఎక్కువ దోస్తులు ఉన్నారు. బండి సంజయ్ నాతో పార్టీ అధ్యక్షుడినినే ఫీలింగ్‌తో కాకుండా ఓ దోస్తు..పెద్దన్నాలా ఉంటారు. 


ప్రశ్న : టీఆర్ఎస్ కాంగ్రెస్ లాగానే బీజీపీలో కూడా కష్టపడ్డవారికి టికెట్లు పదవులు రావంటారు నిజమేనా..మీరు ఒప్పుకుంటారా? 

జవాబు :  చాలా మంది బీజేపీలో సీనియర్లు ఉన్నారు. నాతో అంటుంటారు.. అన్నా 20 ఏళ్లు 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నాం..మమ్ముల్ని పక్కన పెట్టారు... చాలా ఇబ్బందుల్లో ఉన్నామంటారు. కానీ బండి సంజయన్న వచ్చిన తర్వాత మార్పొచ్చింది. ప్రతీ సినియర్ లీడర్‌కు మర్యాద దొరుకుతోంది. గతంలో ఇలా లేదు. ఇప్పుడు అందరిని కలుపుకుని పోవాలని అధ్యక్షుడు అనుకుంటున్నారు. కొత్త వాళ్లు చాలా మంది పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్లు చేరుతున్నారు. ఇంకా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరడానికి అవకాశం కోసం చూస్తున్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తారని అనుకున్నారు. కానీ మధ్యలో ఆగిపోయింది. 


ప్రశ్న : ఆగిపోయిందనుకుంటున్నారా? 

జవాబు :  టోటల్‌గా ఆగిపోయిందని అనను .కానీ మధ్యలో ఆగిపోయింది. ఎందుకంటే కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే టీఆర్ఎస్ పార్టీ ఖతమైపోతదని ఇంటలిజెన్స్ రిపోర్టు కేసీఆర్‌కు ఇచ్చింది. 


ప్రశ్న : అంటే ఏ లెక్కన చెప్తున్నారు? 

జవాబు :  కేటీఆర్ ది హిట్లర్ మెంటాలిటీ. ఎవరైనా ఏ మంత్రిని అయినా ఈజీగా కలవ్వొచ్చు. కానీ కేటీఆర్ ను కలవాలంటే కష్టం. కొంచెం ట్రై చేస్తే ముఖ్యమంత్రిని ఏదో సందర్భంలో కలవొచ్చు. కానీ కేటీఆర్ కు చాలా పొగరు. ప్రజలను..సొంత ఎమ్మెల్యేలను..మంత్రులను కలవరు. ఇంకొక హిట్లర్ తెలంగాణలో పుట్టిండు. అలాంటి కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే..టీఆర్ఎస్ ను వీడాలని చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. 


క్వశ్చన్ : టీఆర్ఎస్ మజ్లిస్ తో ఫ్రెండ్ షిప్ చేస్తుంది కాబట్టి హిందూ వ్యతిరేక పార్టీ అని ముద్ర వేస్తున్నారు. అయోధ్యలో బీజీపీ రామమందిరాన్ని నిర్మిస్తున్నట్లే..కేసీఆర్ కూడా యాదాద్రి టెంపుల్ కడుతున్నాడు..యజ్ఞాలు యాగాలు చేస్తున్నాడు కదా..ఎందుకు టీఆర్ఎస్ పార్టీ హిందువుల పార్టీ కాదంటారు?

జవాబు :కేసీఆర్ షోపుటప్ హిందు. ప్రచారం చేసుకొనేదొకటి ..చేసేదొకటి. రామమందిరం కట్టాలనేది ప్రపంచంలోని రామభక్తుల సంకల్పం. కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాతనే నిర్మాణం జరుగుతోంది. ప్రతి ఒక్క హిందువు డొనేషన్ ఇస్తున్నారు. కానీ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు...


క్వశ్చన్ : ఇచ్చారుగా ...చాలా మంది?

జవాబు : అలాంటప్పుడు అనవసర కామెంట్లు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు చేస్తున్నారు. ఎవరు చెప్పారని కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ల నోళ్లను ఎందుకు మూయించలేదు. అంటే కేసీఆర్ షోపుటాప్ హిందువు. ఒక వైపు అయ్య కేసీఆర్ గుళ్లు కట్టిస్తుంటాడు..మరోవైపు కొడుకు కేటీఆర్ బొట్టు కూడా పెట్టుకోడు. హిందువుల మనోభావాలను కూడా గౌరవిస్తున్నామనే షోపుటాప్ చేస్తారు. 


క్వశ్చన్ : పోలీసులంటే ఎందుకంత కోపం మీకు? సీరియస్ వార్నింగ్‌లు ఇస్తుంటారు. మీ రాజకీయ భవిష్యత్తును నాశనం చెయ్యాలనే కుట్ర పోలీసులు చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఎందుకు పోలీసులు మిమ్ముల్ని టార్గెట్ చేస్తున్నారు?

జవాబు :పోలీసుల కోసం న్యాయం జరగాలని మేము అసెంబ్లీలో కానీ బయట కానీ ఫైట్ చేస్తున్నాం. కానీ కొంతమంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కేసీఆర్ ఫాం హౌజ్ కు వాచ్ మెన్ ల లాగా తయారయ్యారు. రాజాసింగ్ వళ్లనే యూత్ బీజీపీ వైపు ఆకర్షితులవుతున్నారు కాబట్టి రాజాసింగ్ పైన కేసులు పెట్టాలని చూస్తున్నారు. అడ్డుకోవాలనుకుంటున్నారు. 2018లో వనస్థలిపురంలో ఓ ర్యాలీలో పాల్గొన్నాననే కేసులో నిన్న మొన్న కూడా నోటీసులు ఇచ్చారు. 


క్వశ్చన్ : కేసులంటే భయం లేదా? 

జవాబు : కేసులు పెడితే రాజాసింగ్ భయపడి ఇంట్లోనే దాక్కుంటాడని ముఖ్యమంత్రి ఫీలింగ్. నన్ను ఎంత టార్చర్ పెడితే అంత స్పీడుగా దూసుకువెళ్తాను. దాదాపు 60 కి పైగా కేసులు ఉన్నాయి. ఇంకా వంద కేసులు పెట్టినా నో ప్రాబ్లమ్. సంవత్సరం జైలు శిక్ష కూడా పడింది. పది సంవత్సరాలు శిక్ష పడ్డా...ఉరిశిక్ష విధించినా నో ప్రాబ్లమ్. దేశం గురించి ధర్మం గురించి ఒక్కసారి చనిపోవాలనే కల ఉంది. ఆ ఫీలింగ్ ఏ వేరు. ధర్మం గురించి పనిచేయడం..దేశం కోసం చనిపోవడం నాకున్న ఒకే ఒక్క 

కల. 


క్వశ్చన్ : పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై ఎన్నో దాడులు జరిగాయి. మత మార్పిడులు కూడా జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. అలాంటప్పుడు మీ బీజేపీ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది? మీరు కూడా కొంత హడావిడి చేసి మళ్లీ నార్మ్లల్ అయ్యారు ఎందుకు ?

జవాబు : కడప నుంచి అక్రమంగా ఆవులను రాత్రి పూట వాహనాల్లో తరలిస్తున్నారనే వీడియో ఒకటి నాకొచ్చింది. అక్కడ కొంచెం బీజీపీ కార్యకర్తపైన టార్చర్ ఎక్కువ. మత మార్పిడులపై ఫైట్ చేస్తున్నాం. జగన్ మోహన్ ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటే హిందువులకు నష్టం. వైఎస్ ఆర్ కానీ జగన్ కానీ హిందువులకు చేసిన డ్యామేజ్ చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఊళ్లకు ఊళ్లను కన్వర్ట్ చేశారు. గోరక్షణ చేసే వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు. అక్రమంగా ఆవులను తెలంగాణకు తరలిస్తున్నారు. ఆవు మాంసాన్ని కూడా తరలిస్తున్నారు. బీజీపీ వాళ్లు  ఎందుకు అగ్రెస్సివ్‌గా వెళ్లడంలేదో నాకు తెలియదు. పార్టీ ఆదేశిస్తే ఆంధ్రప్రదే‌లో కూడా ధర్మ ప్రచారం ...గోరక్షణ చేస్తా.


క్వశ్చన్ : అంటే ఆంధ్రప్రదేశ్‌లో హిందు ధర్మాన్ని దెబ్బతీస్తుంది వైఎస్ఆర్ పార్టీ అని మీరంటారు?

జవాబు : 100 శాతం నిజం. ఎన్నో గుళ్లపైన దాడి చేసినా..ఎంతమందిని అరెస్ట్ చేశారు. ఒక్క పాస్టర్ ప్లాన్ చేసి గుళ్లపైన దాడులు చేయించినా ..కేసును ఎందుకు పక్క దోవ పట్టిస్తున్నారు. ఫాస్టర్ వెనుక ఎంత మంది ఉన్నారో ఇంకా బయటకు రాలేదు. ఫండింగ్ చేస్తున్నది ఎవరు. ఎన్ని గుళ్లు ధ్వంసం చేశారు ఎంతమందిని చంపారు అనే వివరాలను బాధ్యత ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయటపెట్టడం లేదు.


ప్రశ్న : దేశ వ్యాప్తంగా మీకు చాలా పాపులారిటీ ఉంది. ఎంతో మంది అభిమానులున్నారు. తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడవుతాడని ఒకానొక దశలో భావించారు. కానీ ఎందుకు కేవలం గోషామహల్ కు చెందిన ఎమ్మెల్యేగానే పరిమితమయ్యారు. ఏంటీ మీ నోటి దురుసు వల్లేనా?

జవాబు : లేదు. నాకెప్పుడు ఎమ్మెల్యే రాజకీయ నేత అనే ఫీలింగ్ లేదు. నేనొక హిందువును అనే ఫీలింగ్ మాత్రమే ఉంది. తెలంగాణలో కాదు భారతదేశమంతా తిరిగి దేశం కోసం ధర్మం గురించి యువకులను సిద్ధం చెయ్యాలన్నదే నా సంకల్పం. పార్టీలో ఏదైనా పెద్ద పోస్టు తీసుకుంటే పక్క రాష్ట్రంలో తిరగలేను. లక్ష్మణ్ గారిని చూశాం..ఇప్పుడు బండి సంజయ్ గారిని చూస్తున్నాం. ఆ టెన్సన్ నేను భరించలేను.  ఆ పదవి చాలా టెన్సన్. చిన్న బమ్మర్ది పెద్ద బామ్మర్ది(ఓవైసీ బ్రదర్స్ )లకు ఛాలెంజ్ చెయ్యాలంటే ఆ పదవి అడ్డొస్తుంది. దేశ ద్రోహులకు ..హిందువులకు వ్యతిరేకంగా ఉన్నవారికి ఆ పదవిలో ఉండి సమాధానమివ్వలేను. అందుకే ఫ్రీగా ఉండాలనుకున్నా. 


ప్రశ్న : రాజాసింగ్ గారు సీరియస్‌గా బాక్సింగ్ చేస్తున్నారు. అంతే సీరియస్‌గా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. నాలుగు ఓట్లు సంపాదించుకోవాలంటే ఇంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యడం అవసరమంటారా?

జవాబు : ఎప్పుడు రెచ్చగొట్టేలా మాట్లాడామో చెప్పండి. మా ధర్మం పైనా దేశం పైనా ఎవరైనా కామెంట్ చేస్తే...వాళ్లకు కౌంటర్ ఇస్తే ఇలా ఎలా అంటారు. 


ప్రశ్న : కొందరిని కించ పరిచే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం రాజకీయాల్లో కరెక్టు అంటారా?

జవాబు :ఎలాంటి వ్యక్తులు..ఏ రకమైన కామెంట్లు చేస్తున్నారో..అలాంటి వారికి సరైన సమాధానమిస్తున్నాం. మా దృష్టిలో తప్పు లేదు. వాళ్లంతా సరైన రాజకీయం చేస్తే..మేమెందుకు ఇలా మాట్లాడుతాం చెప్పండి. కాంగ్రెస్ టీఆరెఎస్ లీడర్లు అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీకి కౌంటర్ ఇస్తారా? అంత దమ్ముదా వాళ్లకు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాముల్లాంటి అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ కు పాలు తాగించారు. వీళ్లే హైదరాబాద్ ను నాశనం చేస్తున్నారు. ఓవైసీ బ్రదర్స్  అధికారంలో ఎవరుంటే వాళ్ల కాళ్లు పట్టుకుంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ లీడర్ల కాళ్లు పట్టుకుని ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు. అలాంటి దేశ ద్రోహులకు మా స్టైల్ లో కౌంటర్ ఇస్తున్నాం. మాకు ఆ దమ్ముంది. దాంట్లో తప్పేంలేదు.


ప్రశ్న : మీరు చాలా సంవత్సరాలుగా గో సంరక్షణ ఉద్యమంలో  పనిచేస్తున్నారు. ఉద్యమం పేరిట చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆవు మాంసం తినేవాళ్ల దగ్గర ఏం కొనొద్దు ఏం చెయ్యొద్దని ఓ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య దేశంలో కరెక్టంటారా?

జవాబు :100 శాతం సరైనదే. ఆవు అంటే తల్లిలా చూస్తున్నాం. మాకు దేవుడు. మా దేవుడిని నరికి సంపుతామంటే అలాంటి వ్యక్తుల వద్ద ఒక్క రూపాయి ఐటం కూడా కొనొద్దని హిందువులను కోరుతున్నా. ఎవ్వరినీ కామెంట్ చేయట్లేదు. వాళ్లు బాధపడుతారా లేదా అనేది తర్వాత విషయం. ఆవును కాపాడే బాధ్యత ప్రతి ఒక్క హిందువు పైన ఉంది. గోరక్షణ గురించి బయటకు రావాలని పిలుపిస్తున్నా.  ఆవుమాంసం తినే వాళ్ల వద్ద ఐటెం కొనకపోతే..వాళ్లు రియలైజ్ అయ్యి..ఎందుకు మా దగ్గర ఏం కొనడం లేదని హిందువులను అడుగుతారు. అప్పుడు హిందువులు మా ఆవు మాంసం మీరు తింటారని..ఆవులను చంపుతారని సమాధానమిస్తారు. అలాంటప్పుడు ఆవుమాంసం తినేవారు కూడా బాధపడి..హిందువులకు దేవతతో సమానమని ఆలోచిస్తారు. అలాంటి మాంసం మనం తింటే హిందువులు దూరమవుతున్నారని ..తినడం మానేస్తారు. ఇలాంటి అవేర్ నెస్ రావాలన్నదే నా ఉద్దేశం. 


ప్రశ్న : ఇది ఒక రాజాసింగ్ నిర్ణయమా..?లేక సంఘ్ నిర్ణయమా?మీ బీజేపీ పార్టీ నిర్ణయమా?

జవాబు : నా నిర్ణయమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆవును తల్లిగా దేవుడిలా పూజిస్తా. అందుకోసం గోరక్షణ కోసం పోరాడుతున్నా


ప్రశ్న : ఆవుమాంసం తినేవాళ్ల వద్ద ఏం కొనొద్దని మీరంటున్నారు. కానీ మీరు వేసుకునే దుస్తులు కానీ  షూస్ కానీ గ్లౌజ్ కానీ ఇవన్నీ మేడిన్ అదర్ కంట్రీస్ . అక్కడి బీఫ్ తినేవాళ్లే కదా..అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుని వాడుతున్నారు. ఇది కరెక్ట్ అని అనుకుంటున్నారా?

జవాబు : ఇప్పుడు వాడుతున్న ఒక్క ఐటెంలో కూడా ఆవుకు సంబంధించి ఎలాంటి పదార్ధం లేదు. నేను అన్నీ చూసే కొంటాను. ఏ ఫ్యాక్టరీ ఐటెం కొనాలన్నా ఆ ఫ్యాక్టరీ వాళ్లతో మాట్లాడి..ఏ లెదర్ తో తయారుచేశారో తెలుసుకుని కొనుగోలుచేస్తాను. గతంలో ఒకప్పుడు నాకు జ్ఞానం లేనప్పుడు ఒకసారి లెదర్ చెప్పులు వేసుకున్నా. ఒక పెద్ద వ్యక్తి ఆ చెప్పులు ఆవు చర్మం తో తయారుచేశాడని చెప్పాడు. ఆ రోజు నుంచి బెల్ట్ కూడా పెట్టుకోవడం లేదు. నేనిప్పుడు పెట్టకున్న గ్లౌజ్ కూడా ఆవుది కాదు 


ప్రశ్న : ఇటీవల కాలంలో వందేమాతరం జనగణమన భారత్ మాతా కీ జై అని నినాదాలు చెయ్యని వారిపై సీరియస్ కామెంట్లు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఇంకా చాలా హక్కులున్నాయి కదా.  ఈ నినాదాలు చేస్తేనే భారతీయులుగా హిందువులుగా గుర్తిస్తామనడం ఎంత మాత్రం కరెక్టు?

జవాబు : దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో మనం లేము. కానీ ఆ సమయంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు భారత్ మాతా కీ జై వందేమాతరం అంటూ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. చనిపోయారు. కానీ ఇప్పుడు కొంతమంది కుక్కలు ఈ ఓవైసీ బ్రదర్స్ ..భారత్ మాతాకీ జై అనను వందేమాతరం అని పాడను అని అనడంతో వీళ్ల వల్ల భారతదేశంలో ఉన్న ముస్లింలు చెడిపోతున్నారు. భారత్ మాతా కీ జై వందేమాతరం చెప్తే ఏం నష్టం. నేను నారెకు తక్బీర్ అల్లా ఉ అక్బర్ అంటాను. అంటే నేను కన్వర్ట్ అయిపోయినట్టా.? చాలా మంది ముస్లింలు ఉన్నారు. వాళ్లంతా భయ్యా జై శ్రీరాం అంటారు నాతో .అంటే వాళ్లంతా హిందువులుగా మారినట్టా? కాదు కదా..ఈ ఓవైసీ బ్రదర్స్ లాంటి వ్యక్తుల వళ్లనే హిందువులు ముస్లింలు మధ్యలో గొడవలు వస్తున్నాయి. తెలంగాణలో బీజీపీ ప్రభుత్వం వచ్చాక ..చాలెంజ్ చేస్తున్నా..ఈ ఇద్దరు అన్నాదమ్ములను నడిరోడ్డు మీద నిలబెట్టి రాళ్లతో కొట్టిస్తా. తెలంగాణ నుంచే కాదు భారతదేశం నుంచి బయటకు పంపిస్తాం.


ప్రశ్న : మీరు ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి. ఒక పార్టీకి సంబంధించిన బ్రదర్స్ ను అభ్యంతరకరమైన మాటలు అనడం..బామ్మర్దలు అనడాన్ని ఎలా సమర్థించుకుంటారు?

జవాబు : ఈ బ్రదర్స్  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధికారులపైన.. ఇంతకముందు నెక్కరు వేసుకునే వారు..ఇప్పుడు ప్యాంట్ లు వేసుకుంటున్నారని ...ఇప్పడు పెద్దవాళ్లయ్యారా అని కామెంట్ చేస్తుంటారు. పిల్లలు కనడానికి చాత కాదు మా దగ్గరికి పంపించండి అంటూ నీచంగా మాట్లాడారు. అలాంటి చిన్న బామ్మర్ది పెద్ద బామ్మర్ది పై మా రియాక్షన్ ఇలానే ఉంటుంది. 


ప్రశ్న : రాజాసింగ్ మీకు ఓ సూటి ప్రశ్న. హిందువు అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ లో జాయిన్ కావాల్సిందేనా? బీజీపీ కండువా కప్పుకుంటేనే హిందువవుతారా?

జవాబు : లేదండి. బొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ హిందువే.


ప్రశ్న : పెట్టకోకుంటే అవ్వరా?

జవాబు :అది మీ ఇష్టం. హిందువుగా పుట్టి ధర్మ ప్రచారం చేస్తున్నా. ధర్మ గురించి సంస్కృతి గురించి ప్రచారం చెయ్యమని..బొట్టు పెట్టుకోమని.. గో రక్షణ చెయ్యమని ప్రతి ఒక్క యువకుడిని కోరుతున్నా. అది మా సందేశం. నేను ఏ సభకు ర్యాలీకి వెళ్లినా వేల మంది వస్తారు. అందరికి ఇవే చెప్తాను. వంద మంది మారినా...వాళ్లే వేల మందిని తయారు చేస్తారు. 


ప్రశ్న : ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇలాంటి విద్వేషపూరిత కామెంట్లు చేసి..ప్రశాంత వాతావరణాన్ని మీ లాంటి నేతలు దెబ్బతిస్తున్నారంటే కాదంటారా?

జవాబు :ఎప్పుడు కూడా మా వళ్ల కమ్యునల్ వయలెన్స్ జరగలేదు. కానీ ఈ అక్బరుద్దీన్ ఓవైసీ...పదిహేను నిమిషాలు వదిలేస్తే ..వంద కోట్ల హిందువులకు మా సత్తా ఏందో చూపిస్తా అన్నప్పుడు వాళ్లని ఇలాంటి ప్రశ్న ఎవ్వరూ అడగలేదు. మేం సమాధానం చెప్పాం. నీలో దమ్ముంటే సెక్యురిటీ లేకుండా బయటకు రా...కేవలం ఐదు నిమిషాల్లో  గుంత తీసి అందులో పాతిపెడ్తా అని అక్బరుద్దీన్ కు సవాల్ విసిరాను. అక్బరుద్దీన్ సెక్యురిటీతో తిరుగుతాడు...నేనైతో బుల్లెట పై ఒక్కడినే తిరుగుతా అయినా నా ముందుకు వచ్చే దమ్ము వాళ్లకు లేదు. ఎంఐఎం వాళ్లు కేవలం రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతారు. 


ప్రశ్న : రోహింగ్యాలను కాల్చి చంపాలి..తన్ని తరిమేయాలి..దేశం విడిచి వెళ్లేలా చెయ్యాలని ..మానవత్వం లేకుండా సీరియస్ గా కామెంట్స్ చేస్తుంటారు కదా..వాటిని కూడా సమర్థించుకుంటారా?

జవాబు :మయన్మార్‌లో రోహింగ్యాలు సైన్యం పై దాడి చేశారు. గన్నులు లాక్కున్నారు. ఆర్మీని చంపి..వాళ్ల మాంసం తిన్నారు. రోహింగ్యాలు చాలా డేంజర్. 



క్వశ్చన్ : అన్ని చోట్లా ఒకేలా ఉండరు కదా?

జవాబు : ఇలాంటి ఘోరమైన వ్యక్తులు ఇంకెక్కడా ఉండరు. వాళ్లకు మన దేశంలో తెలంగాణలో ఏం పని. ఎవరు తీసుకొస్తున్నారు?  ఇదంతా కాంగ్రెస్ వాళ్లు చేసిన కుట్ర. బెంగాల్ తో పాటు మిగతా రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు పెంచుకోవడానికి ఈ పని చేశారు. తెలంగాణలో ఎమ్‌ఐ‌ఎం వాళ్లు ఓటు బ్యాంక్ రాజకీయాలు చెయ్యడానికి రోహింగ్యాలను తీసుకొస్తున్నారు. ఇలాంటి డేంజరస్ వ్యక్తులు మన దేశంలో ఎందుకు ఉండాలి. ఎన్నార్సీ  తప్పకుండా అమలవుతుంది. ఏ దేశం నుంచి వచ్చిన వాళ్లను ఆ దేశానికి పంపిస్తాం. వెళ్లకపోతే డైరెక్ట్ పైకి పంపిస్తాం. 

Updated Date - 2021-02-28T03:47:41+05:30 IST