ఇజ్రాయెల్‌, యూకే కంపెనీలతో రక్షా సెక్యూరిటీస్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2021-04-09T05:53:28+05:30 IST

అత్యాధునిక సెక్యూరిటీ సొల్యూషన్లను భారత్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి యూకే, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌ కంపెనీలతో జీఎంఆర్‌ గ్రూప్‌నకు చెందిన రక్షా సెక్యూరిటీ సర్వీసెస్‌ చేతులు కలిపింది

ఇజ్రాయెల్‌, యూకే కంపెనీలతో రక్షా సెక్యూరిటీస్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అత్యాధునిక సెక్యూరిటీ సొల్యూషన్లను భారత్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి యూకే, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌ కంపెనీలతో జీఎంఆర్‌ గ్రూప్‌నకు చెందిన రక్షా సెక్యూరిటీ సర్వీసెస్‌ చేతులు కలిపింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఆక్టోపస్‌, ఫ్రాన్స్‌కు చెందిన ఎక్సావిజన్‌, బ్రిటన్‌కు చెందిన వెస్ట్‌మినిస్టర్‌ గ్రూప్‌, లాజికల్లీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఒప్పందానికి అనుగుణంగా సమగ్ర కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి రక్షా సెక్యూరిటీ్‌సకు అక్టోపస్‌ సాయం చేస్తుంది. ఒప్పందాల ద్వారా లాంగ్‌ రేంజ్‌ సర్వైలెన్స్‌ సొల్యూషన్లు, ఆప్టో ఫోటోనిక్‌, ఇతర ప్రాసెసింగ్‌ టెక్నాలజీలు అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. 

Updated Date - 2021-04-09T05:53:28+05:30 IST