మాణిక్యాలరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన రామ్ మాధవ్

ABN , First Publish Date - 2020-08-11T22:07:08+05:30 IST

తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి కోసం మాణిక్యాలరావు ఎంతోపాటు పడ్డారని, ఆయన అకాల మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్

మాణిక్యాలరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన రామ్ మాధవ్

పశ్చిమగోదావరి: మాజీ మంత్రి మాణిక్యాలరావు అకాల మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి కోసం మాణిక్యాలరావు ఎంతోపాటు పడ్డారని అన్నారు. తాను మాణిక్యాలరావును పలు సందర్భాల్లో కలిసినప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ అభివృద్ధి గురించి చర్చించేవారని గుర్తు చేసుకున్నారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని, కనీసం సొంత ఇల్లు కూడా నిర్మించుకోని కార్యకర్త అని పేర్కొన్నారు. ఆయన అందరికీ స్ఫూర్తి అని అన్నారు. అలాంటి నేత అకాల మరణం తమకు, తమ పార్టీకి తీరని లోటు అని రామ్ మాధవ్ పేర్కొన్నారు. మంగళవారం దివంగత నేత పైడికొండల మాణిక్యాలరావు కుటుంబాన్ని రామ్ మాధవ్ పరామర్శించారు. మాణిక్యాలరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామ్ మాధవ్ వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల సుధాకర్, జిల్లా అధ్యక్షులు కోడూరు లక్ష్మీనారాయణ, బిజెపి నేతలు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-11T22:07:08+05:30 IST