చింతమనేని ఆరెస్టుపై రామకృష్ణ సీరియస్

ABN , First Publish Date - 2021-08-30T21:51:48+05:30 IST

చింతమనేని ప్రభాకర్ అరెస్టు అప్రజాస్వామికమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

చింతమనేని ఆరెస్టుపై రామకృష్ణ సీరియస్

అమరావతి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టు అప్రజాస్వామికమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ధర్నా చేసిన సమయంలో వదిలేసి మరో ఊరిలో అరెస్టు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కొంతమంది పోలీస్ అధికారులు అత్యుత్సాహంతో పని చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలోని ఓ శుభకార్యానికి వెళితే అరెస్టు చేయడమేమిటని నిలదీశారు. ఈ ప్రభుత్వం బుర్రతో పనిచేస్తుందా? లేక మోకాలుతో పనిచేస్తుందో అర్థం కావడంలేదని రామకృష్ణ అన్నారు.

Updated Date - 2021-08-30T21:51:48+05:30 IST