Abn logo
Aug 5 2020 @ 13:02PM

ఆగస్ట్ 5వ తేదీ చరిత్రలో లిఖించదగ్గ రోజు: రమేష్ నాయుడు

విజయవాడ: అయోధ్యలో రామమందిరం భూమిపూజ కార్యక్రమం సందర్భంగా విజయవాడ బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బీజేపీ యువమోర్చా అధ్యక్షులు రమేష్ నాయుడు టపాసులు కాల్చి.. స్వీట్లు పంపిణీ చేశారు. ప్రపంచలోని హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు రాముడు పుట్టిన నేలలోనే  రామమందిరం నిర్మాణానికి నేడు భూమి పూజచేయటం శుభతరుణమన్నారు.


ఈ మహాత్కర ఘట్టంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ సంబరాలు చేసుకుంటున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా భూమిపూజ చేయటం సంతోషకరమన్నారు. ఆగస్ట్ 5వ తేదీ చరిత్రలో లిఖించదగ్గ రోజు అని పేర్కొన్నారు. తెలంగాణ భద్రాద్రి తరహాలోనే ఒంటిమిట్ట రామమందిరంలో కూడా అధికారికంగా ఉత్సవాలు జరపాలన్నారు. నదుల వద్ద శ్రీరామ హారతులు ఇస్తే భక్తులు ఆనందిస్తారని రమేష్ నాయుడు పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement