Abn logo
Oct 15 2021 @ 01:19AM

లాట్‌ మొబైల్స్‌ ప్రచారకర్తగా రష్మిక మందన

హైదరాబాద్‌: లాట్‌ మొబైల్స్‌.. తన ఉత్పత్తుల ప్రచారానికి టాలీవుడ్‌ నటి రష్మిక మందనను నూతన ప్రచారకర్తగా నియమించుకుంది. గడచిన తొమ్మిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తూ వస్తున్న లాట్‌ మొబైల్స్‌కు రష్మిక ప్రచారం మరింతగా దోహదపడనుందని సంస్థ డైరెక్టర్‌ యం.అఖిల్‌ అన్నారు. లాట్‌ మొబైల్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించటం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని ఈ సందర్భంగా  రష్మిక మందన అన్నారు. కాగా రానున్న సంవత్సరాల్లో వందకు పైగా స్టోర్స్‌ను విస్తరించి మరింత మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు డైరెక్టర్‌ అఖిల్‌ చెప్పారు. దసరా సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించినట్లు అఖిల్‌ తెలిపారు. స్ర్కాచ్‌ కార్డుపైన 10 శాతం వరకు గ్యారంటీడ్‌ క్యాష్‌బ్యాక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే గరిష్ఠంగా 5 శాతం, ఒప్పో మొబైల్స్‌పై గరిష్ఠంగా 15 శాతం, వివో మొబైల్స్‌పై 10 శాతం వరకు, ఎంపిక చేసిన సామ్‌సంగ్‌ ఫోన్స్‌పై గరిష్టంగా రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు లాట్‌ మొబైల్స్‌ వెల్లడించింది. 


అలాగే షామీ ఫోన్స్‌ కొనుగోలుపై గరిష్ఠంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌, పేటీఎం క్యాష్‌బ్యాక్‌తో పాటు ఈఎంఐ ద్వారా కొనుగోలు (బజాజ్‌ ఫైనాన్స్‌) చేస్తే రూ.3,500 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నట్లు తెలిపింది. కార్డ్‌లెస్‌ ఈఎంఐ సదుపాయంతో పాటు ఇంకా మరెన్నో ఆఫర్లు తమ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. కాగా దసరా పండగ సందర్బంగా లాట్‌ మొబైల్స్‌ ప్రకటించిన ఆఫర్లు వినియోగించుకోవాలని కస్టమర్లను రష్మిక కోరారు.