రేషన్ ఈ నెల 23 వరకు తీసుకోవచ్చు

ABN , First Publish Date - 2022-01-21T20:09:30+05:30 IST

తెలంగాణ లో రేషన్ సరుకులను ఈనెల 25వ తేదీ వరకూ తీసుకునే వెసులుబాటు కల్పించినట్టు పౌరసరఫరాల ఎన్ ఫోర్స్ మెంట్ డీటీ మాచన రఘునందన్ ఒక ప్రకటనలో తెలిపారు.

రేషన్ ఈ నెల 23 వరకు తీసుకోవచ్చు

నల్గొండ: తెలంగాణ లో రేషన్ సరుకులను ఈనెల 23వ తేదీ వరకూ తీసుకునే వెసులుబాటు కల్పించినట్టు పౌరసరఫరాల ఎన్ ఫోర్స్ మెంట్ డీటీ మాచన రఘునందన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకూ 20వ తేదీ వరకే సరుకులు తీసుకునే అవకాశం ఉండగా వివిధ జిల్లాల అవసరార్థం 23వ తేదీ వరకు పొడిగించినట్టు తెలిపారు.ఆహార భద్రత కార్డు ఉన్న లబ్ది దారులుఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల రేషన్ తీసకోని వారు. ఈ సౌలభ్యాన్ని సద్వినియోగ పరచుకుని రేషన్ తీసుకోవాలని రఘునందన్ సూచించారు.

Updated Date - 2022-01-21T20:09:30+05:30 IST