దహియాపై కనకవర్షం

ABN , First Publish Date - 2021-08-05T23:04:51+05:30 IST

చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి రెండో రజత పతకాన్ని అందించిన రెజ్లర్ రవికుమార్ దహియాపై కనకవర్షం కురుస్తోంది. హర్యానా ప్రభుత్వం ఆయనకు నాలుగు కోట్ల రూపాయల క్యాష్ అవార్డ్ ఇవ్వనుంది.

దహియాపై కనకవర్షం

చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి రెండో రజత పతకాన్ని అందించిన రెజ్లర్ రవికుమార్ దహియాపై కనకవర్షం కురుస్తోంది. హర్యానా ప్రభుత్వం ఆయనకు నాలుగు కోట్ల రూపాయల క్యాష్ అవార్డ్ ఇవ్వనుంది. క్లాస్ వన్ కేటగిరిలో ఉద్యోగం ఇవ్వనున్నారు. అదే సమయంలో హర్యానాలో ఎక్కడ కోరుకుంటే అక్కడ 50 శాతం రాయితీతో భూమి ఇవ్వనున్నారు. ఆయన సొంత గ్రామం నహ్రీలో ప్రభుత్వం ఇండోర్ స్టేడియం కట్టనుంది. తమ గ్రామంలో రెండు గంటలే కరెంట్ ఉంటుందని, నిరంతరం కరెంట్ సరఫరా చేయాలని రవికుమార్ దహియా తండ్రి రెండ్రోజుల క్రితం కోరడం సంచలనం సృష్టించింది. ఏ మాత్రం సౌకర్యాలు లేని గ్రామం నుంచి వచ్చిన దహియా ఒలింపిక్స్‌లో రజతం సాధించడం ప్రేరణాదాయకంగా నిలిచింది. 


57 కేజీల ఫైనల్‌లో రష్యాకు చెందిన రెండుసార్లు ప్రపంచ విజేత అయిన జావుర్ ఉగుయేవ్ చేతిలో ఓటమి పాలైన రవికుమార్ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఈ గెలుపుతో భారత లెజండరీ రెజ్లర్ సుశీల్ కుమార్ సరసన రవికుమార్ చేరాడు. సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో రజత పతకం అందించిన రెండో క్రీడాకారుడిగా రవికుమార్ రికార్డులకెక్కాడు.  తొలి రౌండ్‌లో 0-2తో వెనకబడిన రవికుమార్ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని స్కోర్లు సమం చేశాడు. అయితే, రౌండ్ ముగిసే సమయానికి ఉగుయేవ్ 4-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత అదే జోరు కొనసాగించి 7-2తో ఆధిక్యం సాధించాడు. ఆ తర్వాత రవికుమార్ మరో రెండు పాయింట్లు సాధించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 4-7 తేడాతో ఓటమి పాలయ్యాడు. 

Updated Date - 2021-08-05T23:04:51+05:30 IST