Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా.. ఐసోలేషన్‌లో నలుగురు

లండన్: టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో రవితోపాటు మరో ముగ్గురిని ఐసోలేషన్‌కు పంపారు. వీరిలో ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫిజియో నితిన్ పటేల్ ఉన్నారు. వీరందరినీ జట్టు నుంచి వేరు చేసి ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ నెల 10 భారత్-ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్‌లో చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టు సభ్యులు మాంచెస్టర్ వెళ్లినా, ఐసోలేషన్‌లో ఉన్న ఈ నలుగురు మాత్రం లండన్‌లోనే ఉంటారు.


ఆటగాళ్లు, ఇతర జట్టు సిబ్బందికి రెండు లేటరల్ ఫ్లో టెస్టులు నిర్వహించగా రవిశాస్త్రికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మిగతా వారందరికీ నెగటివ్ ఫలితాలు వచ్చాయి. దీంతో నాలుగో టెస్టు కొనసాగేందుకు ఎలాంటి ఆటంకం కలగలేదు. రవిశాస్త్రి, భరత్ అరుణ్, ఆర్.శ్రీధర్, నితిన్ పటేల్‌ను మెడికల్ టీం నిన్న సాయంత్రం ఐసోలేట్ చేసినట్టు బీసీసీఐ తెలిపింది.


వారందరూ జట్టు హోటల్ రూములోనే ఉంటారని, టీమిండియాతో కలిసి వారు ఎక్కడికీ ప్రయాణించడానికి వీల్లేదని పేర్కొంది. గతరాత్రి ఒకటి, ఈ ఉదయం ఒకటి మొత్తం రెండు టెస్టులు టెస్టులు నిర్వహించగా ఆటగాళ్లందరికీ నెగటివ్ రిపోర్టు వచ్చాయని, దీంతో నాలుగో టెస్టు నాలుగో రోజు ఆడేందుకు అనుమతి లభించిందని పేర్కొంది. 

Advertisement
Advertisement