అక్కడ ‘రెడ్‌’ సిగ్నల్‌!

ABN , First Publish Date - 2020-03-30T08:42:51+05:30 IST

ఆసియాలోనే అతిపెద్ద రెడ్‌లైట్‌ జిల్లా కోల్‌కతాలోని సోనాగచ్చి. కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావం దాని మీదా పడింది. అక్కడ 11 వేల మందికి పైగా సెక్స్‌వర్కర్లు ఉన్నారు. ఈ ప్రాంతానికి రోజుకు సుమారుగా 30 వేల మంది విటులు...

అక్కడ ‘రెడ్‌’ సిగ్నల్‌!

ఆసియాలోనే అతిపెద్ద రెడ్‌లైట్‌ జిల్లా కోల్‌కతాలోని సోనాగచ్చి. కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావం దాని మీదా పడింది. అక్కడ 11 వేల మందికి పైగా సెక్స్‌వర్కర్లు ఉన్నారు. ఈ ప్రాంతానికి రోజుకు సుమారుగా 30 వేల మంది విటులు వస్తుంటారు. అలాంటి ప్రాంతం గత పది రోజులుగా నిర్మానుష్యంగా మారిపోయింది. కారణం కరోనా వైరస్‌. ఈ వైరస్‌ కారణంగా సెక్స్‌వర్కర్ల పరిస్థితి దయనీయంగా మారిందని అంటున్నారు. కోల్‌కతాలో సెక్స్‌వర్కర్ల కోసం పనిచేస్తున్న అతిపెద్ద సంస్థ ‘దర్బార్‌ మహిళా సమన్వయ కమిటీ’ (డిఎంఎస్‌సీ). ‘భారత్‌లో కరోనా ప్రవేశం తర్వాత సోనాగాచిలో సెక్స్‌వర్కర్లు ఆదాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్నార’ని డిఎంఎస్‌సీ అధ్యక్షుడు విశాఖ వెల్లడించారు. కరోనా కారణంగా సెక్స్‌వర్కర్ల దగ్గరకు నిత్యం వచ్చే విటుల సంఖ్య అనూహ్యంగా పడిపోయిందట.


కొందరు సెక్సువర్కర్లు దగ్గు, జలుబు లక్షణాలున్న క్లయింట్లను అనుమతించడం లేదు. ఇంకొందరు సెక్స్‌వర్కర్లు పూర్తిగా తమ గదులకే పరిమితమయ్యారు. అక్కడ మాస్కులు లభించడం లేదు. పైగా జబ్బు సులువుగా సోకే వాతావరణం అక్కడ ఉంది. ప్రస్తుతం సోనాగచ్చి వీధులన్నీ దాదాపుగా ఖాళీగా కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌పై ‘డిఎంఎస్‌ఎస్‌’ సంస్థ అవగాహనా కార్యక్రమాలను సెక్సువర్కర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. బయటి నుంచి వచ్చేవారివల్ల కరోనా సులువుగా వ్యాపిస్తుంది కాబట్టి పలు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వారికి సూచిస్తోంది. ఆ ప్రాంతంలో ఎవరిలోనైనా జలుబు, దగ్గు లక్షణాలు కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలని ఈ సంస్థ ఇప్పటికే సెక్స్‌వర్కర్లకు సూచించింది.  

Updated Date - 2020-03-30T08:42:51+05:30 IST