తగ్గిన పసిడి దిగుమతులు

ABN , First Publish Date - 2021-03-22T06:00:17+05:30 IST

బంగారం, వెండిపై దేశ ప్రజలకు మోజు తగ్గుతోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం

తగ్గిన పసిడి దిగుమతులు

న్యూఢిల్లీ: బంగారం, వెండిపై దేశ ప్రజలకు మోజు తగ్గుతోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి 11 నెలల్లో దేశంలోకి పసిడి దిగుమతుల విలువ 2611 కోట్ల డాలర్లకు పడిపోయింది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 3.3 శాతం తక్కువ. దీంతో గత 11 నెలల్లో వాణిజ్య లోటు, అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 15,137 కోట్ల డాలర్ల నుంచి 8,462 కోట్ల డాలర్లకు పడిపోయింది. ఈ ఏడాది జనవరి వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఎక్కువగా ఉండడం దిగుమతులు తగ్గడానికి ప్రధానంగా దోహదం చేసింది. 


Updated Date - 2021-03-22T06:00:17+05:30 IST