ఏపీలో కొత్తగా 8,835 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-09-16T23:36:28+05:30 IST

ఏపీలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 8,835 కరోనా కేసులు నమోదయినట్లు ఏపీ ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఏపీలో కొత్తగా 8,835 కరోనా కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 8,835 కరోనా కేసులు నమోదయినట్లు ఏపీ ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇప్పటివరకు ఏపీలో 5,92,760కు కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 90,279 యాక్టివ్ కేసులునట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 4,97,376 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో 64 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో రాష్ట్రంలో 5,105 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో 48.06 లక్షల కరోనా టెస్టుల నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. 


కొత్తగా చిత్తూరు 9, నెల్లూరు 7, గుంటూరు 6, ప్రకాశం జిల్లాలో ఆరుగురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అనంతపురం, కడప, కృష్ణా, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారని, కర్నూలు 4, తూర్పుగోదావరి జిల్లాలో 3, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రోజు వివిధ జిల్లాలో అత్యధికంగా నమోదైన కేసులు వివరాలు.. తూర్పుగోదావరి జిల్లాలో 1,421, పశ్చిమగోదావరి జిల్లాలో 1,051, ప్రకాశం 873 కరోనా కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

Updated Date - 2020-09-16T23:36:28+05:30 IST