చరిత్ర సృష్టించిన రిలయన్స్! ఏకంగా 12 లక్షల కోట్ల విలువైన..

ABN , First Publish Date - 2020-07-13T19:35:28+05:30 IST

పన్నెండు లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువను చేరకున్న తొలి భారత కంపెనీగా ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ సంస్థ చరిత్ర సృష్టించింది.

చరిత్ర సృష్టించిన రిలయన్స్! ఏకంగా 12 లక్షల కోట్ల విలువైన..

ముంబై: పన్నెండు లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువను చేరుకున్న తొలి భారత కంపెనీగా ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. రిలయన్స్ షేరు ధర సోమవారం నాడు రూ. 1947కు చేరకోవడంతో కంపెనీ మార్కెట్ విలువ 12 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. కేవలం ఒక నెల వ్యవధిలోనే కంపెనీ తన మార్కెట్ విలువను లక్షల కోట్ల మేరకు పెంచుకోగలిగింది.


ఏప్రిల్ తొలి వారం నుంచి కంపెనీ షేరు ధర పెరుగుతూనే ఉందని మార్కెట్ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా.. ఫేస్‌బుక్ వంటి ప్రపంచ స్థాయి మదుపర్లు జియోలో పెట్టుబడులు పెట్టడంతో కంపెనీ షేర్ ధర పెరుగుతూ పోయిందని వారు చెబుతున్నారు. ఇప్పటివరకూ 12 మంది గ్లోబల్ ఇన్వెస్టర్లు జీయోలో లక్ష కోట్ల పైచిలుకు పెట్టుబడులను తీసుకొచ్చారు.తాజాగా వైర్‌లెస్ టెక్నాలజీ సంస్థ క్వాల్‌కామ్ కూడా రిలయన్స్‌లో 730 కోట్ల రూపాయలకు .15 శాతం వాటా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.


ఇప్పటివరకూ మొత్తం 25.24 శాతం వాటాను విక్రయించడం ద్వారా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ దాదాపు రూ. 1.18 కోట్ల నిధులను సంస్థలోకి రాబట్టారు. రిలయన్స్‌ను రుణ రహిత కంపెనీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భాగంగానే ఆయన.. రిలయన్స్ వాటాల విక్రయానికి పూనుకున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2020-07-13T19:35:28+05:30 IST