Abn logo
Jun 4 2020 @ 17:48PM

గెట్ రెడీ.. జియో నుంచి మరో సరికొత్త ఆఫర్!

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో సరికొత్త బండిల్ ప్యాకేజీని ప్లాన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సభ్యత్వాన్ని అందించే కొత్త ప్లాన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. అయితే, ఏ ప్లాన్‌తో ఈ ఆఫర్ వర్తిస్తుందో వెల్లడించలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించనుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సభ్యత్వం ప్రత్యేకమైన హాట్‌స్టార్ ఒరిజినల్స్, ప్రీమియం కంటెంట్, స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్‌తో పాటు తాజా డిస్నీ కంటెంట్‌ను అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మెంబర్‌షిప్ ఏడాది ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు దీనికి పోటీగా జియో ఈ బండిల్ ప్లాన్‌ను రెడీ చేస్తోంది. ఎయిర్‌టెల్ ఏప్రిల్‌లో సరికొత్త డేటా ప్యాక్‌ను విడుదల చేసింది. ఇందులో డేటాతోపాటు ఏడాదిపాటు డిన్సీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే, ఈ 3జీబీ ప్రీపెయిడ్ డేటా ప్లాన్‌ కాలపరమితి 28 రోజులు మాత్రమే.  

Advertisement
Advertisement
Advertisement