Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైదరాబాద్‌లో ‘రెనాల్ట్ క్విడ్ మైలేజ్ ర్యాలీ’

హైదరాబాద్: మినీ-కారు సెగ్మెంట్‌లో భారతదేశంలో 4 లక్షల మైలురాయిని దాటిన సందర్భంగా రెనాల్ట్ క్విడ్‌ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.  ‘రెనాల్ట్ క్విడ్ మైలేజ్ ర్యాలీ’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో జెండా ఊపి ప్రారంభించారు. రాడిసన్ హోటల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మొత్తం 96 కిలోమీటర్లు సాగింది. క్విడ్ వినియోగదారులు మ్యాగ్జిమం మైలేజ్ పొందాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి అనూహ్యమైన స్పందన లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ర్యాలీలో 25 కంటే ఎక్కువ మంది కస్టమర్లు పాల్గొన్నారని, వారిలో ముగ్గురు అసాధారణంగా 48.81 కేఎంపీఎల్ మైలేజీని పొందారని తెలిపారు. పదో వార్షిక వేడుకల సందర్భంగా రెనో ఇటీవలే క్విడ్‌ ఎంవై 21ను లాంచ్‌ చేసింది. భారతదేశంలో వర్తించే అన్ని సేఫ్టీ నిబంధనలకు కట్టుబడి ఉండే ఎంవై21  అన్ని వేరియంట్స్‌లో డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌ ఫీచర్స్‌ను అందిస్తోంది. ఇక క్విడ్‌ కస్టమర్లందరికీ స్పేర్‌ పార్టులు, విడిభాగాలపై 10 శాతం డిస్కౌంట్‌, లేబర్‌ ఛార్జీలపై 20 శాతం డిస్కౌంట్‌ సహా అనేక స్పెషల్‌ ఆఫర్లను రెనో ప్రకటించింది.

Advertisement
Advertisement