రాతపరీక్షతోనే పోస్టుల భర్తీ

ABN , First Publish Date - 2021-10-23T09:01:16+05:30 IST

రాష్ట్రంలోని ఆలయాల్లో ఉన్న రెగ్యులర్‌ పోస్టులన్నీ భర్తీ చేయాలని దేవదాయశాఖ నిర్ణయించింది.

రాతపరీక్షతోనే పోస్టుల భర్తీ

ఆలయ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌లు 

అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆలయాల్లో ఉన్న రెగ్యులర్‌ పోస్టులన్నీ భర్తీ చేయాలని దేవదాయశాఖ నిర్ణయించింది. ‘టెంపుల్‌ ఎంప్లాయీస్‌’ పోస్టుల భర్తీకి స్పష్టమైన విధానం లేకపోవడంతో సుదీర్ఘ కాలంగా పెద్దఎత్తున ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటన్నిటినీ భర్తీచేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు, ఈవోలను ఆ శాఖ ఆదేశించింది. ముందుగా ఆలయాల్లోని ఖాళీలను గుర్తించి, వాటి భర్తీకి ప్రకటనలు జారీ చేయాలని తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని నియమించి రాతపరీక్ష నిర్వహించాలని, 12 శాతం మార్కులకు మౌఖిక పరీక్ష చేపట్టాలని స్పష్టం చేసింది. భర్తీ విధానం పారదర్శకంగా చేపట్టాలని.. ఆలయ ఉద్యోగులు డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలని స్పష్టం చేసింది. ఇకనుంచి ఆలయాల్లో పీఆర్‌వో, ఎడిటర్‌, హార్టికల్చర్‌ అధికారి, సెక్యూరిటీ ఆఫీసర్లను ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-10-23T09:01:16+05:30 IST