Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 24 2021 @ 17:27PM

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు: జీవన్‌రెడ్డి

కరీంనగర్‌: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనారిటీలకు సీఎం కేసీఆర్ ఏడాదికి వేయి కోట్లు ఖర్చు చేయలేదని విమర్శించారు. ఇళ్ల కేటాయింపులలో ముస్లింలకు 25 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన 60 వేల ఓట్లు సాధిస్తే మనదే విజయమని జీవన్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. కేటీఆర్‌ని సీఎం చేయడానికి సెక్రటేరియట్‌ని కూల్చారని కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. సెక్రటేరియట్‌లో ఉన్న మందిరం, మజీద్, చర్చ్‌లను కూల్చారని తప్పుబట్టారు. మంత్రి హరీష్‌రావు, మాజీమంత్రి ఈటల రాజేందర్ ఇద్దరూ దొంగలేనని షబ్బీర్‌ అలీ దుయ్యబట్టారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement