Advertisement
Advertisement
Abn logo
Advertisement

నివాస గృహాల ధరల ఇండెక్స్‌

  • ప్రారంభించిన హౌసింగ్‌ డాట్‌ కామ్‌, ఐఎ్‌సబీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రధాన నగరాల్లోని గృహాల ధరలను తెలుసుకోవడానికి  ఆన్‌లైన్‌ రియల్‌ ఎస్టేట్‌ పోర్టల్‌ హౌసింగ్‌ డాట్‌ కామ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) కలిసి హౌసింగ్‌ ప్రైసింగ్‌ ఇండెక్స్‌ (హెచ్‌పీఐ)ని ప్రారంభించాయి. ధరల కదలికలకు చెందిన డేటాను అందించడం ద్వారా  కొనుగోలుదారులు తగిన సమయంలో గృహాన్ని కొనుగోలు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. అదే విధంగా ఇల్లు విక్రయించాలనుకునే వారికి ఏ ధరకు, ఏ సమయంలో విక్రయించాలో నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ధోరణులు తెలుసుకుని తగ్గిన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి విధానకర్తలకు, ఫైనాన్షియల్‌ విశ్లేషకులకు దోహదం చేస్తుం ది. కేంద్ర హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ వ్యవహారాల కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా దీన్ని ప్రారంభించారు. గృహాల ధరలు, క్రయ, విక్రయాలు జరిగిన ఇళ్ల సంఖ్య మొదలైన వివరాలను ప్రతి నెల హెచ్‌పీఐ అందిస్తుంది. హైదరాబాద్‌, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లలోని గృహాల ధరలను తెలుసుకోవడానికి ఈ ఇండెక్స్‌ ఉపయోగపడుతుంది.  

Advertisement
Advertisement