భూముల సమస్యలను పరిష్కరించండి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-05-14T06:06:21+05:30 IST

మండలంలోని పొనుగోడు, చిర్రకుంట, పడమటితండా, రాములుతండా, అప్పరాజుపల్లి, జంగుతండా, జగన్నాయకులగూడెం ప్రాం తాల్లోని

భూముల సమస్యలను పరిష్కరించండి : కలెక్టర్‌

గూడూరు రూరల్‌, మే 13: మండలంలోని పొనుగోడు, చిర్రకుంట, పడమటితండా, రాములుతండా, అప్పరాజుపల్లి, జంగుతండా, జగన్నాయకులగూడెం ప్రాం తాల్లోని రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములను కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ బుధవారం పరిశీలించారు. పొనుగోడులో 1500 ఎకరాల్లో దశాబ్ధాల తరబడి 400 మంది రైతులు సాగులో ఉండగా పట్టాలు లేవు. సాదాబైనామా ద్వారా పట్టా కాలంలోకి రైతులను నమోదు చేయాలని స్థానిక అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో పరిష్కారం చేసుకోవాలని సూచించారు.


అంతకుముందు తీగలవేణి పీహెచ్‌సీని కలెక్టర్‌ తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది పనితీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీటి సరఫరా ఏ విధంగా ఉందని సర్పంచ్‌లను అడిగారు. ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు అందేలా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎ్‌ఫవో కిష్టాగౌడ్‌, ఆర్డీవో కొమురయ్య, ఎఫ్‌డీవో కర్నావత్‌ వెంకన్న, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఆర్‌వో అమృత, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏవో అల్లె రాకేష్‌, వీఆర్‌వోలు నరేందర్‌, అశోక్‌, సర్పంచులు నలమాస వెంకన్న, హుస్సేని, బాలునాయక్‌, విజయశ్రీ, కార్యదర్శులు, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-14T06:06:21+05:30 IST