పూర్తి రికవరీకి చేరువలో రిటైల్ రంగం
ABN , First Publish Date - 2021-03-17T06:56:12+05:30 IST
దేశంలో రిటైల్ రంగం పూర్తిస్థాయి రికవరీకి చేరువలో ఉంది. ఫిబ్రవరిలో ఈ రంగం కొవిడ్-19 ముందు కాలం నాటి స్థాయిలో 93 శాతానికి చేరింది. కన్సూమర్ డ్యూరబుల్స్ రంగం 15 శాతం, క్విక్ సర్వీస్
న్యూఢిల్లీ: దేశంలో రిటైల్ రంగం పూర్తిస్థాయి రికవరీకి చేరువలో ఉంది. ఫిబ్రవరిలో ఈ రంగం కొవిడ్-19 ముందు కాలం నాటి స్థాయిలో 93 శాతానికి చేరింది. కన్సూమర్ డ్యూరబుల్స్ రంగం 15 శాతం, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల విభాగం 18 శాతం వృద్ధిని నమోదు చేశాయని రిటైలర్ల సంఘం నివేదిక తెలిపింది. చాలా రంగాల్లో వృద్ధిలో క్షీణత తగ్గిందని, మెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. పాదరక్షలు, బ్యూటీ, వెల్నెస్, పర్సనల్ కేర్, క్రీడా వస్తువులు, ఆహారం, నిత్యావసరాల విభాగాలు క్రమంగా రికవరీ సాధిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ రికవరీ నిలకడగా ఉన్నదని, తూర్పు భారతంలో 2 శాతం సానుకూల వృద్ధి నమోదు కాగా దక్షిణాదిలో అమ్మకాల క్షీణత -6 శాతానికి, ఉత్తరాదిలో -.9 శాతానికి తగ్గిందని ఆ నివేదికలో తెలిపారు.