కాంగ్రెస్‌కు పూర్వవైభవం ఖాయం

ABN , First Publish Date - 2021-08-02T07:27:09+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌కు పూర్వవైభవం ఖాయం

వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే: రేవంత్‌రెడ్డి 


ఘట్‌కేసర్‌ రూరల్‌/ఇంద్రవెల్లి/హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ రూరల్‌ మండల పరిధి కాచవాని సింగారం గ్రామానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రె్‌సలో చేరారు. హైదరాబాద్‌లోని రేవంత్‌రెడ్డి నివాసంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్‌ మట్ట విష్ణుగౌడ్‌తో పాటు వార్డు సభ్యులు చెట్టిపల్లి గీత, మట్ట లలిత, మాజీ వార్డు సభ్యుడు ముత్యంతో పాటు పలువురు గ్రామస్థులు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకు రేవంత్‌ శుభాకాంక్షలు తెలిపారు.


కాగా, హుజూరాబాద్‌ ఎన్నిక కోసమే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని తెరమీదకు తీసుకొచ్చారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 9న నిర్వహించనున్న దళిత, ఆదివాసీ గిరిజన దండోరా బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆదివారం ఆమె ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌కు వచ్చారు. ముందుగా నాగోబా దేవతను దర్శించుకున్నారు. రాష్ట్రంలో జరిగే ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను కరోనా తగ్గే దాకా నిర్వహించవద్దంటూ ఈసీని కోరడం.. సీఎం కేసీఆర్‌ డొల్లతనానికి నిదర్శనమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ హైదరాబాద్‌లో అన్నారు. 

Updated Date - 2021-08-02T07:27:09+05:30 IST