Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంజన్‌కుమార్ యాదవ్‌ను పరామర్శించిన రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్‌ని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పరామర్శించారు. అంజన్‌కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని  చెప్పిన డాక్టర్లు చెప్పారని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 26న అంజన్‌కుమార్‌కు కోవిడ్ వైరస్‌ సోకింది. ఇటీవల మూడుచింతలపల్లి దళిత, గిరిజన దండోరా దీక్షలో అంజన్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఆయనకు జలుబు, జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో అంజన్ కుమార్ యాదవ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటుంన్నారు. 

Advertisement
Advertisement