Abn logo
Oct 19 2021 @ 17:14PM

కేసీఆర్ దళితులకు బంధువు కాదు... రాబందు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్ దళితులకు బంధువు కాదు... రాబందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ దృష్టిలో దళితులు ఓటేసే యంత్రాలు మాత్రమేనన్నారు. దేశంలో అత్యంత దళిత ద్రోహి కేసీఆరే అన్నారు. ఉపఎన్నికలు ప్రజా సమస్యలు మీద జరిగేవి కాదని చెప్పారు. తోడు దొంగల మధ్య మాత్రమే చర్చ జరగుతోందన్నారు. అంబోతుల్లా టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలను గోల్‌మాల్ చేయడానికి మామ అల్లుళ్ళు రంగంలోకి దిగారని వ్యాఖ్యానించారు. దళితబంధు విషయంలో టీఆర్‌ఎస్, బీజేపీలు తోడు దొంగలేనన్నారు. ఇప్పుడే డబ్బులు తీసుకుంటే కాంగ్రెస్‌కి ఓటు వేస్తారని భయం పట్టుకుందని చెప్పారు. దళితబంధు పథకాన్ని ఎన్నికలకు ముందే అమలు చేశారని చెప్పారు. పాత పథకం అయితే ఆపితే ఎలా ఊరకున్నారు? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో వర్గీకరణపై నిలదీస్తే అసెంబ్లీ నుంచి గతంలో తనను బయటకు నెట్టారని గుర్తుచేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption