కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2020-08-09T23:04:22+05:30 IST

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘‘ఏపీ అక్రమ ప్రాజెక్టులకు మీ పరోక్ష సహకారం ఉంది. అపెక్స్ కౌన్సిల్ వాయిదాకు మీరు లేఖ రాయడం దీనికి నిదర్శనం.

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘‘ఏపీ అక్రమ ప్రాజెక్టులకు మీ పరోక్ష సహకారం ఉంది. అపెక్స్ కౌన్సిల్ వాయిదాకు మీరు లేఖ రాయడం దీనికి నిదర్శనం. నారాయణపేట్-కొడంగల్ లిఫ్ట్ ఎందుకు తొక్కి పెట్టారు. లక్షా 7 వేల ఎకరాలకు సాగునీరు రాకుండా చేసిన పాపం మీదే. పాలమూరు-రంగారెడ్డి స్కీంతో నారాయణపేట్, కొడంగల్ ప్రాంతాలకు ఒరిగేది ఏమీ లేదు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ స్కీం సామర్థ్యం ఒక టీఎంసీ తగ్గించారు. ఆ ప్రాజెక్టు నుంచి నారాయణపేట్,కొడంగల్‌కు నీళ్లు రావడం కలే. నారాయణపేట్-కొడంగల్ స్కీం ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైంది. తొలి దశకు 133 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. మీరు అధికారంలోకి వచ్చాక కక్షపూరితంగా ఆ ప్రాజెక్టును తొక్కిపెట్టారు. నారాయణపేట్-కొడంగల్ స్కీంను తక్షణం ప్రారంభించాలి. ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే... మీరు సక్రమ ప్రాజెక్టులు కూడా కట్టడం లేదు. వైసీపీ కీలక నేతలు తెలంగాణ ప్రాజెక్టుల్లో వేల కోట్ల పనులు చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై సుప్రీంలో వేసిన కేసులో పసలేదు’’ అని లేఖలో కేసీఆర్ తీరును రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు.

Updated Date - 2020-08-09T23:04:22+05:30 IST