Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 31 2021 @ 11:42AM

కుమార్తెను టీవీ సౌండ్ పెంచమని.. భార్య ఉన్న గదిలోకి వెళ్లాడు.. కొద్దిసేపటికి పెద్ద శబ్ధాలు.. పరిగెత్తుకుంటూ వచ్చిన స్థానికులు.. రెప్పపాటులో ఘోరం..

మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లా పన్వర్ పోలీస్ స్టేషన్ అధికారి తన సర్వీస్ రివాల్వర్‌లో భార్యపై కాల్పులు జరిపి హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ సంఘటనా స్థలంలోనే ప్రాణాలొదిరారు. సమాచారం అందుకున్న రీవా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటిలోకి కలహాల కారణంగానే ఈ ఘటన జరిగివుంటుందని పోలీలులు ప్రాథమికంగా భావిస్తున్నారు. 

మీడియాకు అందిన వివరాల ప్రకారం పన్వర్ పోలీస్ స్టేషన్ అధికారి హీరా సింగ్ తన భార్య రాణీ పరస్తే, 14 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కుమార్తెతో పాటు అద్దె ఇంట్లో ఉంటున్నారు. పోలీస్ లైన్‌కు సమీపంలో వీరి ఇల్లు ఉంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఇంటికి వచ్చారు.  3 గంటల సమయంలో కుమార్తె టీవీ చూస్తుండగా, కుమారుడు ట్యూషన్‌కు వెళ్లాడు. హరిసింగ్ కుమార్తెను టీవీ సౌండ్ పెంచాలని చెప్పాడు. కొద్ది సేపటికి ఇంటిలో నుంచి పెద్ద శబ్ధం వచ్చింది. వెంటనే చుట్టుపక్కలవారు హరిసింగ్ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి అతని కుమర్తెను ఏమయ్యిందని అడిగారు. ఆమె ఏమయ్యిందో తెలియదంటూ, తల్లిదండ్రులున్న గదివైపు చూపించింది. దీంతోవారు ఆ గది తలుపులు తట్టారు. లోపలి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో పోలీసులకు ఈ సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ గది తలుపులు బద్దలుకొట్టి లోపల భార్యాభర్తలిద్దరూ రక్తపు మడుగులో పడివుండటాన్ని చూశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement