భారీగా వరి ఉత్పత్తి అవుతున్నాతగ్గని బియ్యం ధరలు!

ABN , First Publish Date - 2020-02-20T23:01:49+05:30 IST

: తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో వరి ఉత్పత్తిభారీగా పెరిగింది. అయినా బియ్యం ధరలు అగ్గిమండుతున్నాయి.

భారీగా వరి ఉత్పత్తి అవుతున్నాతగ్గని బియ్యం ధరలు!

హైదరాబాద్‌: తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో వరి ఉత్పత్తిభారీగా పెరిగింది. అయినా బియ్యం ధరలు అగ్గిమండుతున్నాయి. బియ్యాన్ని వ్యవసాయ ఉత్పత్తుల జాబితిలో చేర్చి జీఎస్టీనుంచి మినహాయింపుఇచ్చారు. దీని వల్ల బియ్యం ధరలుతగ్గి సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భావించార. గతంలో బియ్యం పై 4శాతం వ్యాట్‌ను వసూలుచేసేవారు. వ్యాట్‌ వసూలుచేయడం వల్లనే బియ్యం ధరలు పెరుగుతున్నాయని వ్యాట్‌ను తొలగించాలంటూ రైస్‌ మిల్లర్లు, వ్యాపారులు ఆందోళన చేయడం, ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. జీఎస్టీ పుణ్యమా అని బియ్యం పై  అసలు పన్నులేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం బియ్యం అమ్మకాలు ఫ్రీ మార్కెట్‌ అయ్యింది. కానీ ప్రజలు కూడా బియ్యం ధరలుతగ్గుతాయని సంతోషించారు. కానీ వ్యాపారులపై పన్నులభారం తగ్గింది. కానీ వినియోగ దారులపై ధరల భారం తగ్గలేదు. ప్రస్తుతం బియ్యం ధరలుకిలో 46 నుంచి 50 రూపాయలకు తక్కువ లేవు. వ్యాపారులపై వ్యాట్‌ ఉన్నప్పుడూ అదే ధర వ్యాట్‌ తొలగించిన తర్వాత కూడా అదే ధరకు బియ్యం అమ్ముతుండడంతో వ్యాట్‌ ఎవరికిలాభం కలిగిందన్నది అందరికీ అర్ధం అవుతోంది. వ్యాపారులు మిల్లర్ల నుంచి కిలో 28 నుంచి 30 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. కానీ సాధారణ వినియోగ దారులకు కిలో 46 నుంచి 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఇలా ఽపెద్దయెత్తున వినియోగ దారులపై ధరల భారాన్ని మోపుతున్నారు. ఈ పరిస్థితి పై ప్రభుత్వం చర్యలుతీసుకోకపోతే సామాన్య ప్రజలు మరింతగా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వరి సాగులో గణనీయమైన మార్పు

తెలంగాణ పూర్తిగా వరిపై ఆధారపడిన రాష్ట్రంగానే చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం దాదాపుఅన్నిజిల్లాల్లోనూ వరినే అధికంగా వస్తుంటారు. ఈసారిఖరీఫ్‌లో ఊహించని విధంగా దిగుబడి పెరిగింది. గత ఏడాది ఖరీఫ్‌లో 41లక్షల మెట్రిక్‌టన్నులధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ రైతుల నుంచి కొనుగోలుచేసింది. ఇక మిల్లర్లు నేరుగా రైతుల నుంచి మరో 10లక్షల మెట్రిక్‌టన్నులఽ ధాన్యాన్నికొనుగోలుచేసి ఉంటారని అంచనా. అలాగే ఈసంవత్సరం ఖరీఫ్‌లో దాదాపు 50లక్షల మెట్రిక్‌టన్ను ధాన్యాన్ని కొనుగోలుచేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. అంటే కొందరుమిల్లర్లునేరుగా మరో 10లక్షల మెట్రిక్‌టన్నులు కొనుగోలుచేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా తెలంగాణలో భారీఎత్తున ధాన్యం ఉత్పత్తి పెరుగుతోంది. ఖరీఫ్‌పూర్తయిన తర్వాత రెండోపంటగా రబీ సాగు  ప్రారంభమవరతుంది. ఊహించని విధంగా  వరిఉత్పత్తి పెరుగుతున్నా కూడా బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు మా త్రం తగ్గడం లేదు.  మార్కెట్‌లో సన్నబియ్యంకొనాలంటే కనీసం 46 రూపాయలుపెట్టనిదే దొరికే పరిస్థితి లేదు. బియ్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. జీఎస్టీ నుంచి మినహాయింపుఇచ్చిన ఉత్పత్తుల ధరలు తగ్గుతాయని, మినహాయింపు ఫలాలు వినియోగ దారులకు అందేలా చూస్తామని ప్రభుత్వం చెప్పినా ఇప్పటి వరకూ బియ్యం విషయంలో మాత్రం ఏచర్య తీసుకోలేదు. 


Updated Date - 2020-02-20T23:01:49+05:30 IST