దానంలోనూ... కుబేరులే...

ABN , First Publish Date - 2021-01-06T00:36:10+05:30 IST

సంపదలోనే కాకుండా దాతృత్వ కార్యకలాపాల్లోను ముందున్నాడు... ప్రపంచ కుబేరుడు, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్. కేవలం ఒక్క 2020 లోనే ఛారిటీ కోసం ఎక్కువగా ఖర్చు చేసిన వారిలో బెజోస్ ముందుండడం విశేషం. వాతావరణ మార్పులపై పోరాటం కోసం గతేడాది 10 బిలియన్ డాలర్లను ఆయన అందించారు. మొతంతం 2020 లోనే అతిపెద్ద విరాళమిది. క్రానికకల్ ఆఫ్ ఫిలాంత్రఫీస్ యాన్యువల్ లిస్ట్ ప్రకారం కిందటి సంవత్సరం బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు.

దానంలోనూ... కుబేరులే...

 న్యూయార్క్ : సంపదలోనే కాకుండా దాతృత్వ కార్యకలాపాల్లోను ముందున్నాడు... ప్రపంచ కుబేరుడు, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్. కేవలం ఒక్క 2020 లోనే ఛారిటీ కోసం ఎక్కువగా ఖర్చు చేసిన వారిలో బెజోస్ ముందుండడం విశేషం. వాతావరణ మార్పులపై పోరాటం కోసం గతేడాది  10 బిలియన్ డాలర్లను ఆయన అందించారు. మొతంతం 2020 లోనే అతిపెద్ద విరాళమిది. క్రానికకల్ ఆఫ్ ఫిలాంత్రఫీస్ యాన్యువల్ లిస్ట్ ప్రకారం కిందటి సంవత్సరం బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు.


కాగా... బెజోస్ ఎర్త్ ఫండ్ జెఫ్ బెజోస్ నికరాదాయం దాదాపు 188 బిలియన్ డాలర్లు. బెజోస్ ఎర్త్ ఫండ్ ద్వారా ఆయన పెద్దమొత్తంలో విరాళాలందిస్తున్నారు. వాతావరణ సంక్షోభంలో చిక్కుకున్న లాభాపేక్షలేని సంస్థలకు బెజోస్ ఎర్త్ ఫండ్ మద్దతునిస్తోంది. ఎర్త్ ఫండ్ ద్వారా ఆయన ఇప్పటి వరకు 16 గ్రూపులకు 790 మిలియన్ డాలర్ల సహకారమందించినట్లు క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రపీస్ వెల్లడించింది. బెజోస్‌ను మినహాయిస్తే టాప్ 10 వితరణలు 2011 తో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఈ మొత్తం వితరణ 2.6 బిలియన్ డాలర్లు మాత్రమే. ఈ బిలియనీర్ల సంపద గతేడాది భారిగా పెరిగినప్పటికీ, విరాళాలు మాత్రం తగ్గాయని తెలిపింది. 


ఇక కిందటి సంవత్సరం మార్చి 18 నుండి డిసెంబరు 7 వరకు బెజోస్ సంపద 60 శాతం మేర పెరిగింది. బెజోస్ తర్వాత ఫిల్‌నైట్, అతని భార్య ఉన్నారు. వీరిద్దరు రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ఫిల్‌నైట్ ఆదాయం గతేడాది మార్చి నుండి డిసెంబరు మధ్య కాలంలో 77 శాతం పెరిగింది. నైట్, అతని భార్య 900 మిలియన్ డాలర్ల మేర దాతృత్వ కార్యకలాపాలకు వినియోగించారు. దాతృత్వ కార్యకలాపాల కోసం నైట్ ఫౌండేషన్ ను కూడా ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఓరెగాన్ కోసం 300 మిలియన్ డాలర్లనిచ్చారు. 


జుకర్ బర్గ్ 250 మిలియన్ డాలర్లు...  ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, ఆయన సతీమణి 250 మిలియన్ డాలర్ల విరాళాన్నందించారు. హెచ్‌బీఈ కార్పోరేషన్ కంపెనీ ఫౌండర్ ఫ్రెడ్ కుమ్మర్, అతని భార్య 300 మిలియన్ డాలర్ల మేరకు పలు దాతృత్వ కార్యకలాపాలకు వినియోగించారు.

Updated Date - 2021-01-06T00:36:10+05:30 IST