లారస్‌ ల్యాబ్స్‌ చేతికి రిచ్‌కోర్‌ లైఫ్‌

ABN , First Publish Date - 2021-01-21T05:54:53+05:30 IST

లారస్‌ ల్యాబ్స్‌ చేతికి రిచ్‌కోర్‌ లైఫ్‌

లారస్‌ ల్యాబ్స్‌ చేతికి రిచ్‌కోర్‌ లైఫ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బెంగుళూరకు చెందిన రిచ్‌కోర్‌ లైఫ్‌సైన్సెస్‌ కంపెనీలో మెజారిటీ వాటా లారస్‌ ల్యాబ్స్‌ చేతికి వచ్చింది. దీంతో లారస్‌ ల్యాబ్స్‌ బయోటెక్నాలజీ విభాగంలోకి అడుగు పెట్టినట్లవుతుంది. ఎయిట్‌ రోడ్స్‌ వెంచర్స్‌, వెంచర్‌ఈస్ట్‌ ప్రోయాక్టివ్‌ ఫండ్‌ తదితరాల నుంచి 72.55 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. రూ.246.67 కోట్లకు ఈ వాటాను సొంతం చేసుకున్నట్లు లారస్‌ ల్యాబ్స్‌ తెలిపింది. 

Updated Date - 2021-01-21T05:54:53+05:30 IST