కశ్మీర్‌లో 2020 ఉగ్రవాదంపై పోలీస్ బాస్ లేటెస్ట్ రిపోర్ట్

ABN , First Publish Date - 2021-01-01T01:03:02+05:30 IST

ఇక తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరు విద్యార్థులని వారికి ఉగ్రవాద కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం ఏదని వారి కుటుంబాలు వాదిస్తున్నాయి.

కశ్మీర్‌లో 2020 ఉగ్రవాదంపై పోలీస్ బాస్ లేటెస్ట్ రిపోర్ట్

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో 2019 ఏడాదితో పోలిస్తే 2020 ఏడాదిలో ఉగ్రవాదంలో చేరిన వారి సంఖ్య పెరిగిందని అయితే ఉగ్రవాద ఘటనలు స్వల్పంగా తగ్గాయని జమ్మూ కశ్మీర్ రాష్ట్ర మంగళవారం పోలీలస్ బాస్ దిల్‌బాగ్ సింగ్ ప్రకటించారు. గత రెండేళ్లుగా ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయని, 2020లో మరింతగా తగ్గాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ అనేక మార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ ఏడాది చొరబాటు సంఖ్య కూడా తగ్గిందని అన్నారు. కాగా, ఈ ఏడాది 225 మంది ఉగ్రవాదులు హతమయ్యారని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.


‘‘2019తో పోల్చుకుంటే ఈ ఏడాది ఉగ్రవాద ఘటనలు స్వల్పంగా తగ్గాయి. అయితే ఉగ్రవాదంలో చేరిన వారి సంఖ్య పెరిగింది. అయితే 70 శాతం మందిని అరెస్ట్ చేశాం. దీంతో ఉగ్రవాదుల సంఖ్యను నియంత్రించగలిగాం. జమ్మూలో పది మందికి పైగా ఉగ్రవాద కార్యకలాపాల్లో చేరారు. ముగ్గురు మినహా మిగతా వారిని అరెస్ట్ చేశాం. వారిని కూడా త్వరలో పట్టుకుంటాం. కశ్మీర్‌లో ఎక్కువ మంది ఉగ్రవాద సానుభూతిపరులుగా మారడానికి పాకిస్తాన్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. గట్టి భద్రత ఉన్నప్పటికీ డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డబ్బు అందిస్తోంది. అయితే ఇలాంటి ప్రయత్నాలను కూడా చాలా వరకు తగ్గించాం’’ అని దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.


ఇక తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరు విద్యార్థులని వారికి ఉగ్రవాద కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం ఏదని వారి కుటుంబాలు వాదిస్తున్నాయి. ఒక వ్యక్తి 11వ తరగతి చదువుతుండగా మరొకరు యూనివర్సిటీ స్థాయిలో చదువుతున్నారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక మూడవ వ్యక్తం సైతం కార్పెంటర్ పని చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై డీజీపీ దిల్‌బాగ్ సింగ్ మాట్లాడుతూ ‘‘తల్లిదండ్రులకు వారి పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు. వారు బహిరంగంగా కనిపించకపోవచ్చు కానీ, అంతర్గత కార్యకలాపాల్లో భాగమై ఉంటారు. అయినా మేం ఈ ముగ్గురిని ఉగ్రవాద జాబితాలో చేర్చలేదు’’ అని అన్నారు.

Updated Date - 2021-01-01T01:03:02+05:30 IST