ఏడాదిన్నర క్రితం America నుంచి వచ్చిన NRI.. ఇంట్లో నిద్రిస్తుండగా అర్థరాత్రి దొంగలు ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2021-09-05T03:21:48+05:30 IST

ఓ ఎన్నారై ఇంట్లో అర్థరాత్రి దూరిన దొంగలు భారీ చోరీ చేశారు. కత్తులు, తుపాకులతో ఇంట్లోని వారిని బెదిరించి దాదాపు 70 వేల నగదు, బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్స్, ఇతర విలువైన సామాగ్రిని..

ఏడాదిన్నర క్రితం America నుంచి వచ్చిన NRI.. ఇంట్లో నిద్రిస్తుండగా అర్థరాత్రి దొంగలు ఏం చేశారంటే..

ఓ ఎన్నారై ఇంట్లో అర్థరాత్రి దూరిన దొంగలు భారీ చోరీ చేశారు. కత్తులు, తుపాకులతో ఇంట్లోని వారిని బెదిరించి దాదాపు 70 వేల నగదు, బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్స్, ఇతర విలువైన సామాగ్రిని దోచుకెళ్లారు. ఈ ఘటన పంజాబ్‌లోని చిచ్‌రెవాల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని, ఎన్నారై రంజిత్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఎడాదిన్నర క్రితం ఆయన భారత్ చేరుకుని చిచ్‌రెవాల్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. గోర్ఖాలోని తన తల్లి సిమ్రన్‌జిత్ కౌర్ ఇంటికి గురువారం రాత్రి రంజిత్ ఇంటికి వెళ్లారు. ఆయనతో పాటు మరదలు కన్‌వల్‌జిత్ కౌర్‌ కూడా వెళ్లింది. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో కుటుంబసభ్యులతో కలిసి రంజిత్‌ నిద్రిస్తున్నాడు.


 రాత్రి 12: 30 గంటల సమయంలో నలుగురు మాస్కులు ధరించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. తలుపు గొళ్లెం పగలగొట్టి మరీ ఇంట్లోకి దూసుకొచ్చారు. తుపాకులు, కత్తులు, ఐరన్ రాడ్లు వంటి ఆయుధాలను తీసుకుని ఇంట్లోకి ప్రవేశించిన ఆ దొంగలను చూసి ఇంట్లోని వారంతా బెంబేలెత్తిపోయారు. వారిలో ఓ దొంగ రంజిత్ సింగ్ గుండెకు తుపాకీ పెట్టి.. ఎదురుతిరిగితే చంపేస్తానని, ఇంట్లో ఎవరినీ ప్రాణాలతో వదిలిపెట్టమని బెదిరించాడు. ఇళ్లంతా తిరిగి దాదాపు రూ.70వేల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలు, 2 మొబైల్ ఫోన్‌లు, 8 ఫారెన్ వాచీలు, రెండు క్రెడిట్ కార్డులు, 6 ఏటీఎం కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, టార్చ్‌లతో పాటు ఇంకా విలువైన సామాన్లను దోచుకెళ్లారు.


చోరీకి సంబంధించిన సమాచారం అందుకోగానే.. జబ్బల్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఇన్‌స్పెక్టర్ గుర్‌చరణ్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు సేకరించి విచారణ ప్రారంభించారు. కేసుకు సంబంధించి డీఎస్పీ సుచా సింగ్ బాల్ మాట్లాడుతూ.. నిందితులను త్వరలో పట్టుకుంటామని, గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లోని ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించే పనిలో ఉన్నామని వివరించారు.

Updated Date - 2021-09-05T03:21:48+05:30 IST