ఫెడరర్‌కు షాక్‌

ABN , First Publish Date - 2021-07-08T09:17:34+05:30 IST

వింబుల్డన్‌లో ఎనిమిది సార్లు చాంపియన్‌ రోజర్‌ ఫెడరర్‌కు క్వార్టర్స్‌లో షాక్‌ తగిలింది. వచ్చేనెలలో 40వ ఏట ప్రవేశించనున్న స్విస్‌ దిగ్గజం.. పోలెండ్‌కు చెందిన తన అభిమాని, 14వ సీడ్‌ హ్యూబర్ట్‌ హర్కాజ్‌ చేతిలో కంగుతిన్నాడు...

ఫెడరర్‌కు షాక్‌

  • పోలెండ్‌ కుర్రాడి చేతిలో ఓటమి 
  • సెమీస్‌లో జొకోవిచ్‌, షపోవలోవ్‌
  • వింబుల్డన్‌

లండన్‌: వింబుల్డన్‌లో ఎనిమిది సార్లు చాంపియన్‌ రోజర్‌ ఫెడరర్‌కు క్వార్టర్స్‌లో షాక్‌ తగిలింది. వచ్చేనెలలో 40వ ఏట ప్రవేశించనున్న స్విస్‌ దిగ్గజం.. పోలెండ్‌కు చెందిన తన అభిమాని, 14వ సీడ్‌ హ్యూబర్ట్‌ హర్కాజ్‌ చేతిలో కంగుతిన్నాడు. కాగా, టాప్‌సీడ్‌ జొకోవిచ్‌ వింబుల్డన్‌లో 10వసారి సెమీ్‌సకు దూసుకెళ్లాడు. మరో క్వార్టర్స్‌లో రష్యన్‌ కారెన్‌ కచనోవ్‌పై 10వ సీడ్‌ డెనిస్‌ షపోవలోవ్‌ పోరాడి నెగ్గాడు. సెమీస్‌లో జొకోతో షపోవలోవ్‌ తలపడనున్నాడు. 


హ్యూబర్ట్‌ సంచలనం..

తన ఆరాధ్య ఆటగాడు ఫెడెక్స్‌పై పోలెండ్‌ కుర్రాడు హ్యూబర్ట్‌ సంచలన విజయంతో సెమీ్‌సకు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో 6వ సీడ్‌ ఫెడరర్‌ 3-6, 6-7(4), 0-6తో హ్యూబర్ట్‌ (పోలెండ్‌) చేతిలో వరుస సెట్లలో ఓటమి పాలయ్యాడు. హ్యూబర్ట్‌ తొలిసెట్‌ను 6-3తో సులువుగా నెగ్గినా.. రెండో సెట్‌లో ఫెడెక్స్‌ నుంచి పోటీ ఎదురైంది. 6-6తో సమంకాగా.. ట్రైబేక్‌లో హర్కాజ్‌ 7-4తో గెలిచి రెండో సెట్‌ను దక్కింకున్నాడు.  ఇక మూడో సెట్‌లో హ్యూబర్ట్‌ దూకుడు ముందు రోజర్‌ పూర్తిగా చేతులెత్తేశాడు. ఒక్కగేమ్‌ కూడా నెగ్గకుండానే చివరి సెట్‌ను 0-6తో హ్యూబర్ట్‌కు సమర్పించు కున్నాడు. ఇప్పటిదాకా ఒక్క గ్రాండ్‌స్లామ్‌లోనూ మూడో రౌండ్‌ దాటని 24 ఏళ్ల హ్యూబర్ట్‌ ఈసారి ఏకంగా సెమీస్‌ చేరడం విశేషం. 22వ సారి ఇక్కడ తలపడ్డ స్విస్‌ మాస్టర్‌ ఇలా వరుససెట్లలో ఓడడం 2002 తర్వాత ఇదే తొలిసారి. అంతేకాదు.. ఈ వేదికపై అతనికిది 119 మ్యాచుల్లో 14వ ఓటమి.



జొకో @ 100: ఫుల్‌జో్‌షలో ఉన్న సెర్బియా యోధుడు జొకోవిచ్‌ టైటిల్‌కు రెండడుగుల దూరంలో నిలిచాడు. జొకో 6-3, 6-4, 6-4తో మార్టన్‌ ఫ్యుచోవిచ్‌పై సునాయాసంగా నెగ్గి సెమీ్‌సకు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో జొకోవిచ్‌ గ్రాస్‌కోర్టులో 100వ విజయాన్ని నమోదు చేశాడు. హోరాహోరీగా సాగిన మరో క్వార్టర్స్‌లో మ్యాచ్‌లో కెనడాకు చెందిన డెనిస్‌ షపోవలోవ్‌  6-4, 3-6, 5-7, 6-1, 6-4తో 25వ సీడ్‌ కారెన్‌ కచనోవ్‌ (రష్యా)పై ఐదు సెట్లపాటు చెమటోడ్చి నెగ్గాడు. 





పోరాడి ఓడిన సానియా జోడీ


వింబుల్డన్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. మిక్స్‌డ్‌ బరిలో మిగిలిన రోహన్‌ బోపన్న-సానియా మీర్జా జంట ప్రీక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. మూడో రౌండ్‌లో రోహన్‌ - సానియా జోడీ 3-6, 6-3, 9-11తో డచ్‌-స్లొవేనియా ద్వయం  జీన్‌ జులియన్‌ రోజర్‌-ఆండ్రెజా క్లిపాక్‌ చేతిలో పోరాడి ఓడింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలిసెట్‌ను 3-6తో కోల్పోయినా.. రెండో సెట్‌ను సానియా జంట 6-3తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. అయితే, నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఇరు జంటలూ పట్టువీడకుండా పోరాడడంతో 9-9తో స్కోరు సమమైంది. అయితే, భారత జంట సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన జులియన్‌ జోడీ 11-9తో నెగ్గి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. 


Updated Date - 2021-07-08T09:17:34+05:30 IST