రోహిత్, ఇషాంత్ టెస్టుల్లో ఆడాలంటే అదొక్కటే దారి: కోచ్ రవిశాస్త్రి

ABN , First Publish Date - 2020-11-23T04:02:55+05:30 IST

ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ ఇషాంత్ శర్మలు ఆస్ట్రేలియా టూర్‌ టెస్ట్ స్వాడ్‌లో ఉన్నారా..? లేదా..? అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీంఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి...

రోహిత్, ఇషాంత్ టెస్టుల్లో ఆడాలంటే అదొక్కటే దారి: కోచ్ రవిశాస్త్రి

ఇంటర్నెట్ డెస్క్: ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ ఇషాంత్ శర్మలు ఆస్ట్రేలియా టూర్‌ టెస్ట్ స్వాడ్‌లో ఉన్నారా..? లేదా..? అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీంఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. రాబోయే నాలుగైదు రోజుల్లో రోహిత్, ఇషాంత్‌లు ఆస్ట్రేలియా చేరుకోవాలని, అప్పుడే టెస్టు జట్టులో వారికి స్థానం లభించే అవకాశాలున్నాయని చెప్పాడు. ‘ఆస్ట్రేలియా వెళ్లినా ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉంచే అవకాశం ఉంది. 


ఈ నేపథ్యంలో ఆటగాళ్లు ఎంత ముందుగా అక్కడకి చేరుకుంటే అంత మంచిది. ఒకవేళ అది కుదరకపోయినా, రోహిత్, ఇషాంత్‌లు భారత్‌లోనే ఎక్కువ కాలం ఉండాల్సి వచ్చినా వారు జట్టుతో చేరే అవకాశాలు సన్నగిల్లిపోతాయ’ని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. మరి దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Updated Date - 2020-11-23T04:02:55+05:30 IST